ఏడాదిలో బీజేపీకి ఐదు రాష్ట్రాలు ఎందుకు చేజారిపోయాయి..?

By సుభాష్  Published on  25 Dec 2019 8:15 AM GMT
ఏడాదిలో బీజేపీకి ఐదు రాష్ట్రాలు ఎందుకు చేజారిపోయాయి..?

ముఖ్యాంశాలు

  • బీజేపీపై ప్రజలు ఎందుకంత అసంతృప్తి

  • ఏడాదిలోనే ఐదు రాష్ట్రాల్లో బీజేపీకి ఎదురు దెబ్బ

  • జార్ఖండ్‌లో బీజేపీని ఎందుకు విస్మరించారు

బీజేపీకి పతనం మొదలైంది. దేశంలో ఎంతో వికసించే కమలం వాడిపోతోంది. కేవలం ఒక సంవత్సరంలోని ఐదు రాష్ట్రాలు చేజారిపోయాయి. రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్ గడ్, జార్ఖండ్ లలో బీజేపీ నామరూపాలు లేకుండా పోయింది. ఆరు నెలల కిందటే బీజేపీని అఖండ మెజార్టీతో సింహాసనం మీద కూర్చోబెట్టిన జనాలు ఇప్పుడెందుకు ఓడించారు..? ఆరు నెలల్లోనే బీజేపీపై ప్రజలు ఎందుకంత ప్రతాపం చూపించారు..? అనేది తలెత్తుతున్న ప్రశ్న.

ప్రజల్లో ఎందుకంత అసతృప్తి:

దేశ పగ్గాలు చేపట్టిన బీజేపీపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఆర్టికల్ 370 రద్దు, పౌరసత్వం సవరణ, అయోధ్య సానుకూలమైన వైఖరి, ఇప్పుడు ఎన్నార్సీ హిందుత్వ ఎజెండాను బీజేపీ తలకెత్తుకుందని అన్ని వర్గాల్లో కూడా అసంతృప్తికి కారణమైందని టాక్ వినిపిస్తోంది. దళితులు, మైనార్టీలు, బహుజనులు గులాబీ దళానికి దురమయ్యారు. ఇవన్ని ప్రచారం చేసినా..జార్ఖండ్ లో ప్రజలు ఓడించారు. కమలానికి ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నవారిని దూరం చేయడంపై పలువురు విశ్లేషకులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు.

జార్ఖండ్ లో బీజేపీని ఎందుకు విస్మరించారు :

మహారాష్ట్ర మరాఠాలు, రాజస్థాన్ లో జాట్ లు, జార్ఖండ్ లో గిరిజనులను బీజేపీ విస్మరించింది. జార్ఖండ్ లో జేఎంఎం అధినేత హేమంత్ సోరెన్ ఆధ్వర్యంలో బీజేపీకి వ్యతిరేకంగా సాగిన భూపోరాటాలే ఆయనను విజయ తీరాలకు చేర్చాయనే చెప్పాలి. దేశంలో జార్ఖండ్ అత్యధిక గిరిజనులు ఉన్నరాష్ట్రం. వారినే బీజేపీ విస్మరించింది. కాగా, గిరిజనుల హక్కులను కాపాడేందుకకు హేమంత్ ముందుండి పోరాటం కొనసాగించారు. 2016లో గిరిజనుల భూములను కంపెనీలకు ధారపోసేందుకు బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకువచ్చింది. దానికి వ్యతిరేకంగా భూమి హక్కుల పోరాటాన్ని హేమంత్ పెద్ద ఉద్యమాన్ని లేపాడు. లక్షలాది మంది గిరిజనులతో రోడ్డెక్కి హేమంత్ ఆందోళన బాట పట్టాడు. బీజేపీ సర్కార్ భూ చట్టాలను మార్చి గిరిజనులను నిలువునా ముంచుతుందని హేమంత్ ఆరోపణలు గుప్పించడంతో ఆయన మాటలను నమ్మిన గిరిజనులు ఈ ఎన్నికల్లో హేమంత్ కూటమినే అధికారం కట్టబెట్టారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గిరిజనుల తరపున పోరాడిన హేమంత్ కాంగ్రెస్ ఆర్జేడీలు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాయి. ఈ కారణంగా బీజేపీపై అసంతృప్తి వ్యక్తం కావడంతో అధికారం కోల్పోవల్సి వచ్చిందని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. ఇప్పుడు అధికారం చేజిక్కించుకున్న కాంగ్రెస్‌, జేఎంఎం అధినేత ఈనెల 29న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బీజేపీ ప్లాన్ బెడిసికొట్టిందా..?

ముందు నుంచే బీజేపీ అన్ని రాష్ట్రాల్లో కూడా తమ ప్రభుత్వం పగ్గాలు చేపట్టాలని భావించిన భారతీయ జనతాపార్టీ.. స్థానిక పార్టీలను లెక్క చేయకుండా ఒంటరిగానే ముందుకెళ్లింది. కానీ బీజేపీ చేసిన ప్లాన్ ను ప్రజలు బోల్తా కొట్టేలా చేసేశారు. జార్ఖండ్ లో ఐదేళ్ల పాటు బీజేపీ ప్రభుత్వంలో కలిసున్న ఏజేఎస్యూను ఎన్నికల సమయంలో దూరం పెట్టడం దుమారం రేపిందనే చెప్పాలి. ఇక పొరుగు రాష్ట్రాల్లో బీహార్ లో మిత్రపక్షాలుగా ఉన్న జేడీయూ ఎల్జేపీని కూడా జార్ఖండ్ లో కలుపుకోకుండా కమలం పార్టీ బీరాలకు పోయింది. ఇవే పార్టీలు జార్ఖండ్ లో బీజేపీని చిత్తు చేసి అకాశంలో బీజేపీ నేలకు దించేలా చేశాయని పలువురి విశ్లేషకుల వాదన. ఏదేమైన దేశంలో అతివిశ్వాసంతో బీజేపీ తప్ప ఇతర పార్టీలు ఉండవద్దని భావించిన కమలానికి తగిన గుణపాఠం చెప్పారనేది జార్ఖండ్ రాజకీయ నేతల వాదన. మరి కేంద్రంలో గద్దెనెక్కిన సంవత్సరంలోనే బీజేపీకి ఇలాంటి ఎదురుదెబ్బలపై ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందో వేచి చూడాల్సిందే.

Next Story
Share it