రాజధాని అంశంపై బీజేపీ కీలక వ్యాఖ్యలు..!
By Newsmeter.Network Published on 5 Jan 2020 11:46 AM IST
అమరావతి: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. సీఏఏ వేరు.. ఎన్‌ఆర్సీ వేరని కన్నా తెలిపారు. మోదీ లక్ష్యం.. సబ్‌కాసాత్.. సబ్‌కా వికాస్ అని ప్రతి ఒక్కరి అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. సీఏఏపై కొందరు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. జనజాగరణ అభియాన్ పేరుతో కార్యక్రమం చేపడుతామని కన్నా పేర్కొన్నారు. ప్రతి ఇంటికి బీజేపీ కార్యకర్త వెళ్లి సీఏఏ, ఎన్‌ఆర్సీపై అవగహన పెంచుతారని తెలిపారు.
రాజధాని ఎక్కడుండాలనేది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమని కన్నా అన్నారు. 2014లో రాజధానిని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారని.. దాని ఆధారంగానే అమరావతి రాజధానిగా ప్రధాని శంకుస్థాపన చేశారని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం కూడా నిధులిచ్చిందన్నారు. స్టేక్ హోల్డర్స్ ఆమోదం లేకుండా రాజధాని మార్చే అధికారం లేదని వివరించారు. రాజధాని అంశంపై బీజేపీ సృష్టంగా ఉందని తెలిపారు. వైసీపీ, టీడీపీ, బీజేపీ నాడు రాజధానికి మద్దతిచ్చాయని కన్నా తెలిపారు. ఫెడరల్ సిస్టంలో కేంద్రం అన్నింటిలో ఇన్వాల్స్ అవ్వదన్నారు. దాని ఆధారంగానే రాజధానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని కన్నా అన్నారు.
విశాఖలో పౌరసత్వ సవరణ చట్టంపై అవగహన పెంచేందకు బీజేపీ భారీ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కేసింగ్, మాజీ ఎంపీ హరిబాబు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పెద్ద ఎత్తున అవగహన కార్యక్రమాలు చేపడుతోంది.