Fact Check : ఈ వీడియోలో ఉన్నది మధ్యప్రదేశ్ లోని భేదఘాట్ జలపాతమేనా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  28 July 2020 7:01 AM GMT
Fact Check : ఈ వీడియోలో ఉన్నది మధ్యప్రదేశ్ లోని భేదఘాట్ జలపాతమేనా..?

@anusehgal అన్న ట్విట్టర్ అకౌంట్ లో జలపాతానికి సంబంధించిన వీడియో పోస్టు చేశారు. మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ ప్రాంతంలో ఉన్న భేదఘాట్ జలపాతం ఇదని ఆ అకౌంట్ లో పోస్టు చేశారు. దీంతో చాలా మంది ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు. “Desi Niagara falls- Beraghat falls- Jabalpur in this monsoon via (WAP)” (మన దేశానికి నయాగరా జలపాతం ఇదే..!) అంటూ ట్వీట్ చేశారు.

ఫేస్ బుక్ లో కూడా చాలా మంది భేదఘాట్ జలపాతానికి చెందిన వీడియో అంటూ చెప్పుకొచ్చారు.

B1

నిజ నిర్ధారణ:

భేదఘాట్ జలపాతానికి చెందిన వీడియో అంటూ వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు.

ఈ వీడియోను చూసిన చాలా మంది.. అక్కడ ఉన్నది కర్ణాటక రాష్ట్రంలోని 'జాగ్ జలపాతం' అని చెప్పుకొచ్చారు.

ఈ వీడియోకు చెందిన కీఫ్రేమ్స్ ను ఉపయోగించి గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా అది కర్ణాటక రాష్ట్రంలోని 'జాగ్ జలపాతం' అని తేలింది. సెప్టెంబర్, 2019న ఈ వీడియోను తీసినట్లు కొన్ని రిజల్ట్స్ చూపించాయి.

డిసెంబర్ 2018న పోస్టు చేసిన వీడియోలో కూడా ఈ ప్రదేశమే కనిపించింది. జాగ్ వాటర్ ఫాల్స్ ప్రపంచంలోని అందమైన జలపాతాల్లో ఒకటి.. భారతదేశంలో ఎత్తైన రెండో జలపాతం ఇది..! ఉత్తరకన్నడ, శివమొగ్గ జిల్లాల మధ్యలో కర్ణాటక రాష్ట్రంలో ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. ఉత్తరకన్నడ జిల్లాలో ఒక మంచి వ్యూ పాయింట్, శివమొగ్గ జిల్లాలో మరో మంచి వ్యూ పాయింట్ ఉంటుంది. శరావతి నదిపై ఈ వాటర్ ఫాల్స్ ఉన్నాయి.

జాగ్ వాటర్ ఫాల్స్ లో నీటి ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు ఎంతో అందంగా ఉంటుందని తెలియజేస్తూ పలువురు వీడియోలను అప్లోడ్ చేశారు. 2018లో తీసిన వీడియోను చూడొచ్చు. లింగనమక్కి డ్యామ్ నుండి నీటిని విడుదల చేసినప్పుడు ఈ వాటర్ ఫాల్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయి.

Deccan Herald అక్టోబర్ 2018లో ప్రచురించిన కథనం ప్రకారం జాగ్ ఫాల్స్ లోకి 22000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తూ ఉంటారు. డ్యామ్ పూర్తీ కెపాసిటీ 1817 అడుగులకు చేరుకున్నప్పుడు నీటిని విడుదల చేస్తూ ఉంటారు.

వీడియోలో చూపించిన విజువల్స్.. భేదఘాట్ వాటర్ ఫాల్స్ కు చెందినవి కావు. కర్ణాటక లోని జాగ్ వాటర్ ఫాల్స్ కు చెందిన వీడియోలు..!

Next Story