భానుమతి అండ్ రామకృష్ణ ట్రైలర్‌ను విడుదల చేసిన హీరో నాని
By తోట వంశీ కుమార్ Published on 2 July 2020 6:05 PM ISTడిజిటల్ ప్లాట్ ఫార్మ్ లో విడుదల కానున్న మరొక చిత్రం 'భానుమతి అండ్ రామకృష్ణ'. నవీన్ చంద్ర, సలోని లూథ్రా జంటగా దర్శకుడు శ్రీకాంత్ నాగోతి తెరకెక్కించిన ఈ రొమాంటిక్ లవ్ డ్రామా జులై 3న ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా పై విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాని ఈ చిత్ర కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు. 30 ఏళ్ల వయసులో అందమైన ప్రేమకథ అని ట్వీట్‌చేశాడు.
అంతకముందు.. ఈ చిత్రానికి కొత్త టైటిల్ సమస్య వచ్చింది. ముందుగా 'భానుమతి రామకృష్ణ' అనే టైటిల్ ఉండగా.. లెజండరీ నటి భానుమతి రామకృష్ణ తనయుడు మద్రాస్ హైకోర్ట్‌లో చిత్ర బృందంపై కేసు వేశాడు. మా ఫ్యామిలీ అనుమతి లేకుండా మా అమ్మ పేరు సినిమాకి పెట్టి మమ్మల్ని అగౌరవ పరిచారని కోర్టుకి తెలిపారు. వివరాలని పరిశీలించిన కోర్టు చిత్ర టైటిల్‌ని మార్చాలని తెలిపింది. దీంతో చిత్రానికి 'భానుమతి మరియు రామకృష్ణ' అనే టైటిల్ ను పెట్టారు. గ్రామీణ నేపథ్యం కలిగిన అమాయకపు సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్‌గా నవీన్ చంద్ర చిత్రంలో కనిపించి అలరించనున్నారు. పుల్‌ఎంటర్‌టైనింగ్‌గా డిజిటల్ ఆడియన్స్‌కి నచ్చేలా సినిమా సాగిపోతుందని నిర్మాత యశ్వంత్ ములకట్ల అన్నారు.