ఓ గంటకు సంబంధించిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతూ ఉన్నాయి. ఆ గంట మీద ‘జై శ్రీరామ్’ అని రాసి ఉంది. దీన్ని రామ మందిరం కోసం తయారు చేయిస్తూ ఉన్నారని.. మొత్తం ఎనిమిది లోహాలతో తయారు చేయించినట్లుగా పోస్టులు పెడుతూ ఉన్నారు.

రామ మందిరానికి సంబంధించిన బెల్ ఇప్పటికే తయారు చేశారు. దాదాపు 2100 కిలోల బరువు ఉంటుంది. అష్టధాతువులతో అంటే ఎనిమిది లోహాలతో నిర్మించారు. బంగారం, వెండి, రాగి, జింక్, సీసం, తగరం, ఇనుము, పాదరసం లతో తయారు చేశారని వైరల్ మెసేజీలో ఉంది. అంతేకాదు ఆ గంటను కొడితే 15 కిలోమీటర్ల దూరం వరకూ వినిపిస్తుందని వైరల్ అవుతున్న మెసేజీలో ఉంది.

“Ram Mandir bell is almost ready; single cast piece, easily the largest,6’X5’, weighing 2,100kg made of Ashtadhatu, a combination of eight metals — gold, silver, copper, zinc, lead, tin, iron and mercury. This can be heard up to 15Km.#[email protected] https://t.co/8F3LSjbrIV” అంటూ మెసేజీ వైరల్ అవుతూ ఉండగా.. ఇందులో ఎంత నిజం ఉందో తెలియజేయాలని న్యూస్ మీటర్ కు రిక్వెస్ట్ వచ్చింది.

నిజ నిర్ధారణ:

వైరల్ అవుతున్న పోస్టు నిజం కాదు..!

న్యూస్ మీటర్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా.. వైరల్ అవుతున్న ఫోటో ఉన్న వార్త కనిపించింది. “600 kg bell going from Tamil Nadu to Ayodhya Ram Temple” అంటూ కథనాన్ని రాశారు. 600 కేజీల బెల్ ను తమిళనాడు నుండి అయోధ్య లోని రామ మందిరానికి పంపుతూ ఉన్నారు అని రాసి ఉంది.

11

ఈ వార్తను ఆధారంగా చేసుకుని కీ వర్డ్స్ సెర్చ్ నిర్వహించాము. రామ మందిరానికి కావాల్సిన గంట గురించి సెర్చ్ చేయగా.. 2100 కిలోల బరువుతో ఎనిమిది లోహాలతో ఆ బెల్ ను తయారు చేయిస్తున్నారన్నది నిజమే..!

కానీ వైరల్ అవుతున్న ఫోటోలో ఉన్న ఉన్న గంట బరువు 600 కేజీలు మాత్రమే. తమిళనాడు లోని ఎఱాళ్ లో ఉన్న రామకృష్ణన్ నాడార్ షాపులో తయారు చేశారు.

22

ఆ షాపుకు సంబంధించిన సమాచారం జస్ట్ డయల్ లో కూడా లభించింది. ఆ కాంటాక్ట్ లో వైరల్ వీడియోలో ఉన్న గంటను గమనించవచ్చు.

33

అయోధ్య లోని రామ మందిరం కోసం తయారు చేస్తున్న గంట బరువు 2100 కిలోలు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లోని ఈటా జిల్లాలోని జలేసర్ టౌన్ లో నిర్మిస్తూ ఉన్నారు.

కాబట్టి వైరల్ అవుతున్న ఫోటోలో ‘ఎటువంటి నిజం లేదు’.. వైరల్ పోస్టులో ఉన్న గంటను అయోధ్య రామ మందిరం కోసం ఉపయోగించలేదు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet