గత కొద్దిరోజులుగా వాట్సప్, ఇతర సామాజిక మాధ్యమాల్లో 500 రూపాయలకు సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతోంది. రెండు 500 రూపాయల నోట్లను చూపించి అందులో ఉన్న తేడాను చెబుతూ ఉన్నారు.

“Pls do not accept Rs. 500 currency note on which the green strip is close to Gandhi ji because it’s fake. Accept currency note where the strip is near Governor’s signature. Please pass this message to all family and friends…” అంటూ మెసేజీని ఫార్వర్డ్ చేస్తూ ఉన్నారు.

01

'దయచేసి ఎవరూ 500 రూపాయల నోటులో గాంధీకి దగ్గరగా ఆకుపచ్చ రంగు స్ట్రిప్ ఉంటే దాన్ని తీసుకోకండి.. ఎందుకంటే ఆ నోటు ఫేక్..! గవర్నర్ సంతకానికి దగ్గరగా ఉన్న నోటునే తీసుకోవండి. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు తెలియజేయండి అంటూ ఆ మెసేజీలో ఉంది.

కొత్తగా రిజర్వ్ బ్యాంకు విడుదల చేసిన 2000, 500 రూపాయల నోట్ల విషయంలో గతంలో కూడా ఇలాంటి ఎన్నో వదంతులు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.

నిజమెంత:

వైరల్ అవుతున్న పోస్టులో ఎటువంటి నిజం లేదు. ప్రతి ఒక్క నోటుకు ఒక్కో రకమైన గుర్తింపులు ఉంటాయి. అంత మాత్రాన ఇది నిజమైన నోటు.. ఇది వాడుకకు పనికి రాని నోటు అని చెప్పలేము.

రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఇప్పటికే తాము సరికొత్త మహాత్మా గాంధీ సిరీస్ ను విడుదల చేస్తున్నామని తెలిపింది. కొత్త సిరీస్ లో భాగంగా రంగు, సైజ్, థీమ్, లొకేషన్, డిజైన్ వంటి విషయాన్ని స్పష్టంగా వెల్లడించింది. కొత్త నోటు సైజ్66mm x 150mm.. ఈ నోట్లు స్టోన్ గ్రే రంగులో ఉండగా.. ఆ నోటు మీద ఎర్ర కోట ఉంది.

RBI.org లో కొత్త 500 రూపాయల నోటుకు సంబంధించిన వివరాలను పొందుపరిచారు.

02

వీటిలో ఎక్కడ కూడా మహాత్మా గాంధీకి దూరంగా ఆకుపచ్చ రంగు స్ట్రిప్ ఉండాలని.. గవర్నర్ కు దగ్గరగా మాత్రమే ఉండాలని ఎక్కడ కూడా చెప్పలేదు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా తమ సైట్ లో అప్లోడ్ చేసిన 500 రూపాయల ఫోటోలో కూడా వైరల్ అవుతున్న ఫోటో లో లాగే మహాత్మా గాంధీకి దగ్గరలో ఉంది.

కేవలం 500 రూపాయల నోటులో గాంధీకి దగ్గరగా ఆకుపచ్చ రంగు స్ట్రిప్ ఉంటేనే.. గవర్నర్ సంతకానికి దగ్గరగా ఉన్న నోటునే తీసుకోవాలి అన్న దాన్లో ఎటువంటి నిజం లేదు. ఎన్నో విషయాలను పరిగణ లోకి తీసుకుని.. అధికారులను సంప్రదించి అది ఫేక్ నోటా.. కాదా అన్నది తెలుసుకోవాలి.

న్యూస్‌మీటర్ తెలుగు

Next Story