బ్యాంకులకు మూడు నెలల్లో 30 రోజుల సెలవులు

By సుభాష్  Published on  27 May 2020 4:30 AM GMT
బ్యాంకులకు మూడు నెలల్లో 30 రోజుల సెలవులు

దేశ వ్యాప్తంగా కరోనా రక్కిసి పట్టిపీడిస్తున్నా.. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిత్యావసరాలకు సంబంధించిన షాపులే కాకుండా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు మూతపడ్డాయి. అయితే లాక్‌డౌన్‌ కష్టాలున్నప్పటికీ బ్యాంకులు మాత్రం మూడపడకుండా వినియోగదారులకు సేలవలందించాయి. ఇక లాక్‌డౌన్‌ 4.0 సడలింపుతో కొన్ని షాపులు, దుకాణాలు తెరుచుకున్నాయి. ఇక కరోనా కాలంలో కూడా బ్యాంకులు వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తుండా సేవలందించాయి.

ఇక రాబోయే మూడు నెలల్లో బ్యాంకులకు 30 రోజులు సెలవులు రానున్నాయి. రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించిన సెలవుల జాబితా ప్రకారం.. జూన్‌, జులై, ఆగస్ట్‌లో శని, ఆదివారాలతో పాటు పండగలు కలుపుకొని మొత్తం దాదాపు 30 రోజులు సెలవులు రానున్నాయి. ఆ రోజుల్లో బ్యాంకులు పని చేయవు. అందులో వినియోగదారులు సెలవులకు అనుగుణంగా బ్యాంకు పనులు చేసుకోవాల్సి ఉంటుంది.

జూన్‌:

ఆ నెలలో శని, ఆదివారాలు కలుపుకొని సెలవులు ఇలా ఉన్నాయి. జూన్‌ 7వ తేదీ, 13, 14, 17,23,24,31 తేదీల్లో బ్యాంకులకు సెలవులు ఉంటాయి. అంతేకాదు వీటితో పాటు 18 గురు హర్‌ గోబింద్‌జీ జయంతి కారణంగా చాలా రాష్ట్రాల్లో సెలవు ఉంటుంది.

జులై

ఈనెలలో శని, ఆదివారాలతో 5వ తేదీ, 11,12,19,25,26 తేదీల్లో బ్యాంకులకు సెలవులు. వీటితో పాటు జులై 31న బక్రీద్‌ పండగ వల్ల సెలవు ఉండనుంది.

ఆగస్టు:

ఇక ఆగస్టు నెలలో శని, ఆదివారాల వల్ల 2వ తేదీ, 8,9,16,22,23,29, 30వ తేదీల్లో బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇక వీటితో పాటు ఆగస్టు 3వ తేదీన రక్షాబంధన్‌, 11న శ్రీకృష్టమి (స్థానిక సెలవు), 12న శ్రీకృష్ణ జన్మాష్టమి, 15న స్వాతంత్ర్య దినోత్సవం, 21న తీజ్‌ లోకల్‌ హాలిడే, 22న వినాయక చవితి, 30న మొహర్రం, 31న ఓనమ్‌ సందర్భంగా బ్యాంకులకు సెలవులు వచ్చాయి. ఇలా మూడు నెలల్లో 30 రోజులపాటు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. దీంతో ప్రజలు ఈ సెలవులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకు పనులు చేసుకోవాల్సి ఉంటుంది.

Next Story