విషాదం: రెండు పడవలు ఢీః.. 30 మంది జల సమాధి

By సుభాష్  Published on  29 Jun 2020 5:04 PM IST
విషాదం: రెండు పడవలు ఢీః.. 30 మంది జల సమాధి

బంగ్లాదేశ్‌ రాజధాని ఢాకాలో విషాదం చోటు చేసుకుంది. నదిలో ప్రయాణిస్తున్న రెండు పడవలు ఢీకొనడంతో 30 మంది మృతి చెందారు. మరికొంత మంది నదిలో ఈతకొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. సోమవారం బంగ్లాదేశ్‌లోని బురిగంగా నదిలో రెండు పడవలు ప్రయణిస్తున్నాయి. మార్నింగ్‌బర్డ్‌ అనే పడవ మున్షిగంజ్‌ నుంచి సదర్‌ ఘాట్‌వైపు వెళ్తోంది. ఈ క్రమంలో మరో మౌయూరీ అనే పడను ఢీకొట్టింది. దీంతో ఓ పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 30 మంది వరకూ జల సమాధి అయ్యారు. పడవలో 50 మంది వరకు ఉన్నట్లు అక్కడి అధికారుల ద్వారా సమాచారం.

అయితే పడవ మునగగానే కొంత మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. పడవ ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న రెస్క్యూ టీమ్‌ రంగంలోకి దిగింది. సహాయక చర్యలు ముమ్మరం చేపట్టి, మృతుల కోసం గాలింపు చర్యలు చేపట్టింది.

మృతుల్లో 20 మంది పురుషులు, ఏడుగురు మహిళలు, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మరి 15 నుంచి 20 మీటర్ల లోతులో ఉన్న ఓటు శిథిలాల నుంచి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. అలాగే మునిగిపోయిన బోటును బయటకు తీసేందుకు రెస్క్కూ సిబ్బంది మరో బోటు సాయంతో ప్రయత్నిస్తున్నారు. కాగా, 2015లో కూడా బంగ్లాదేశ్‌ నదిలో కార్గో బోటు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 78 మంది మరణించారు

Next Story