బండ్ల గణేష్ కు మంట పుట్టేలా ట్వీట్లు చేసిన పీవీపీ, హరీష్ శంకర్.!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 May 2020 2:50 PM IST
బండ్ల గణేష్ కు మంట పుట్టేలా ట్వీట్లు చేసిన పీవీపీ, హరీష్ శంకర్.!

టాలీవుడ్ లో ఎంతో టాలెంట్ ఉన్న దర్శకుల లిస్టులో హరీష్ శంకర్ ఒకరు. ముఖ్యంగా ఆయన డైలాగ్స్ ఏ రేంజిలో ఉంటాయో మిరపకాయ్, గబ్బర్ సింగ్.. లాంటి సినిమాలను చూస్తే అర్థమవుతుంది. ఈ మధ్యనే 'గద్దల కొండ గణేష్' సినిమా ద్వారా మంచి హిట్ ను అందుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతూ ఉన్నాడు. తాజాగా అనుకోకుండా ఓ వివాదంలో ఇరుక్కున్నాడు హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ సినిమా ఎనిమిది సంవత్సరాలు పూర్తీ అయిన సందర్భంగా అందరికీ కృతఙ్ఞతలు తెలుపుతూ ఓ పోస్టు పెట్టాడు హరీష్ శంకర్. ఆ పోస్టులో నిర్మాత బండ్ల గణేష్ పేరును ప్రస్తావించలేదు. బండ్ల గణేష్ పేరును మరిచిపోయానని తర్వాత ఓ ట్వీట్ వేశారనుకోండి. అప్పటి నుండి బండ్ల గణేష్ కు హరీష్ శంకర్ కు కోల్డ్ వార్ సాగుతోంది.



‘అదీ ఆయ‌న‌ సంస్కారం.. పవన్ కళ్యాణ్‌కి పరిచయం చేసి సినిమా అవకాశం ఇప్పించింది నేను.. ఎన్టీఆర్‌తో సినిమా మిస్ అయ్యి డిప్రెషన్‌లో ఉంటే.. నేను పిలిచి సినిమా ఇచ్చా.. ఆయన గబ్బర్ సింగ్ లాంటి హిట్ వచ్చిందంటే ఎవరివల్లో మరిచిపోయారు’ అని బండ్ల అన్నారు. తాజాగా మరో ట్వీట్ చేశారు బండ్ల గణేష్ ‘తింటున్నంత సేపు ఇస్తరాకు అంటారు. తిన్నాక ఎంగిలి ఆకు అంటారు. నీతో అవసరం ఉన్నంత వరకు వరసలు కలిపి మాట్లాడతారు. అవసరం తీరాక… లేని మాటలు అంటకడతారు’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.



వీరిద్దరి ఫైట్ లోకి ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి చేరారు. బండ్ల గణేష్ పై ఇన్ డైరెక్ట్ గా సెటైర్లు వేస్తూ సినిమా కాదు కదా.. కనీసం షార్ట్ ఫిలిం కూడా బండ్ల గణేష్ తీయలేడని ప్రసాద్ వి పొట్లూరి వ్యాఖ్యలు చేశారు. ‘పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడ గురించి బ్రహ్మాండంగా చెప్పావు హరీష్‌. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్‌లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి వెయింటింగ్‌. తమ్ముడు స్టార్ట్‌‌ యువర్‌ కుమ్ముడు’ అని ట్వీట్ చేశాడు. పీవీపీ ట్వీట్‌పై హరీష్ శంకర్ స్పందించాడు. ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీ 'భాష,భావం' రెండూ నన్ను అలరించాయి. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం’ అని హరీష్ శంకర్ మరో ట్వీట్ చేశాడు.

ప్రసాద్ వి పొట్లూరికి, బండ్ల గణేష్ కు కొన్ని రోజుల కిందట గొడవైన సంగతి తెలిసిందే..! బండ్ల గణేష్ మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు పీవీపీ. ఆ తర్వాత ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. పెద్ద హైడ్రామానే నడిచింది.

Next Story