సీఎం కేసీఆర్‌పై బండి సంజ‌య్ ఫైర్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  16 Oct 2020 11:34 AM GMT
సీఎం కేసీఆర్‌పై బండి సంజ‌య్ ఫైర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్.. సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చి.. ప్రజల్లో తిరగాలని డిమాండ్ చేశారు. దిల్‌సుఖ్ నగర్, గడ్డి అన్నారం, బైరామల్ గూడ, బంజారా కాలనీ తదితర ముంపు ప్రాంతాలలో బండి సంజయ్ ఈరోజు పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఆరేళ్లలో చెరువులు, నాలాలు ఆక్రమణకు గురయ్యాయ‌ని.. దీనికి టీఆర్ఎస్ బాధ్యత వహించాలని అన్నారు. కాలనీలన్నీ మూసీ నదిని త‌ల‌పిస్తున్నాయ‌ని, వ‌ర‌ద‌ల్లో కార్లన్నీ మునిగిపోయాయని.. రేపటి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కారు త‌ప్ప‌కుండా మునుగుతుంద‌ని అన్నారు

ముంపు ప్రాంతాల్లోని వారికి తిండి, నీళ్లు, కరెంట్ లేవని, వస్తువులన్నీ నానిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. యుద్ధప్రాతిపదికన వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కేంద్రం సాయం చేయడానికి సిద్ధంగా ఉందని.. ఐదువేల కోట్లు అడుగుతున్న కేసీఆర్.. కోవిడ్ నిధులు దారి మళ్లించారని ఫైర్ అయ్యారు.

Next Story