గుంటూరు: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

By సుభాష్  Published on  16 Oct 2020 7:11 AM GMT
గుంటూరు: ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రొంపిచర్ల సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఓ కారు కాల్వలోకి దూసుకెళ్లడంతో నలుగురు మృతి చెందారు. ప్రకాశం జిల్లా పామర్రుకు చెందిన రమణయ్య తన ఇంటి పనుల నిమిత్తం జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన మధు మేస్త్రీతో మాట్లాడుకునే గురువారం రాత్రి కారులో మహేష్‌, బీరుగౌడ్‌, బాలాజీ, ఆనంద్‌లు కలిసి పామర్రుకు బయలుదేరారు. అయితే వర్షం కారణంగా రొంపిచర్ల వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న కాల్వలో పడిపోయింది.

దీంతో ఘటన స్థలంలోనే నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను బయటకు తీసి నరసరావుపేట ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే మృతులంతా జగిత్యాల జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు.

Next Story
Share it