బాలయ్య మూవీ టైటిల్ మారిందా..? ఇంతకీ కొత్త టైటిల్ ఏంటి..?
By Medi Samrat
నందమూరి నటసింహం బాలకృష్ణ తమిళ దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని సి. కళ్యాణ్ నిర్మిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ లో షూటింగ్ చేశారు. దసరా సందర్భంగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడం.. ఇందులో బాలయ్య కత్తి పట్టుకున్న పవర్ ఫుల్ లుక్ కి అనూహ్యమైన స్పందన రావడం జరిగింది. ఫస్ట్ లుక్ అయితే రిలీజ్ చేసారు కానీ... టైటిల్ ఏంటి..? అనేది మాత్రం ఎనౌన్స్ చేయలేదు.
ఇప్పటివరకు ఈ మూవీకి 'రూలర్' అనే టైటిల్ ఖరారు చేయనున్నట్టు ప్రచారం జరిగింది. తాజాగా జడ్జిమెంట్, డిపార్ట్ మెంట్ అనే టైటిల్స్ ను కూడా పరిశీలిస్తున్నారట. వీటిలో కథాపరంగా ఏది బెటర్ ? అనేది చిత్ర యూనిట్ ఆలోచిస్తోంది. ఇందులో బాలయ్య సరసన అందాల భామలు సోనాల్ చౌహాన్, వేదిక నటిస్తున్నారు. ఈ మూవీ కొత్త షెడ్యూలు రామోజీ ఫిల్మ్ సిటీలో ఈనెల 18న మొదలవుతుంది.
ఫస్ట్ లుక్ కి వచ్చిన రెస్పాన్స్ తో బాలయ్య & టీమ్ చాలా హ్యాపీగా ఉన్నారట. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ మూడవ వారంలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని తెలిసింది. అయితే... టైటిల్ ను దీపావళికి ప్రకటిస్తారా..? ప‌్రకటిస్తే.. ఏ టైటిల్ ఖరారు చేస్తారు అనేది ఆసక్తిగా మారింది.