రాజ్యసభ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన..
By తోట వంశీ కుమార్ Published on 19 Jun 2020 5:02 PM ISTఏపీలో నాలుగు స్థానాలకు రాజ్యసభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఓ ఆసక్తికర ఘటన జరిగింది. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటు వేసేందుకు వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. బాలయ్య నడుచుకుంటూ వెలుతున్నప్పుడు.. ఒక కుక్క మొరిగింది. దానికి బాలయ్య సమయోచితంగా స్పందించారు. ఎవరికి అర్థమయ్యే బాషలో వాళ్లకి అలాగే చెప్పాలన్నారు. తాము అరిచేశాళ్లం కాదు.. కరిచేవాళ్లమని పంచ్ డైలాగ్ వేశారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. శుక్రవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాల్‌లో ఓటు వేశారు. మరో వైపు అసెంబ్లీ స్వీకర్ తమ్మినేని సీతారాం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. వైఎస్సార్ సీపీ తరపున రాజ్యసభకు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని, పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ పోటీ ఉండగా, టీడీపీ తరపున వర్ల రామయ్య బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి మొదట ఎమ్మెల్యే బాలకృష్ణ ఓటు వేశారు. అరెస్ట్ కారణంగా అచ్చెన్న, అనారోగ్య కారణంగా అనగాని ఓటింగుకు దూరంగా ఉన్నారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగనుంది. ఆరు గంటలకు రిటర్నింగ్ అధికారి ఫలితాలను వెల్లడిస్తారు. కోవిడ్ పరిస్థితులతో ఫిజికల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ వంటి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.