ఏపీలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం.. జగన్‌ సర్కార్‌ మరో కీలక ఒప్పందం

By సుభాష్  Published on  19 Jun 2020 11:02 AM GMT
ఏపీలో వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం.. జగన్‌ సర్కార్‌ మరో కీలక ఒప్పందం

ఏపీలోని జగన్‌ సర్కార్‌ మరో కీలక ఒప్పందం కుదుర్చుకుంది. పశువుల కోసం ప్రపంచ స్థాయి వ్యాక్సిన్‌ తయారీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ఈ ఒప్పందం చేసుకుంది. దీంతో పులివెందులలో ఈ వ్యాక్సిన్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు ఐజీవైతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఒప్పందం చేసుకున్నారు. ఈ మేరకు అవగాహన ఒప్పందంపై ఏపీ కార్ల్‌ సీఈవో డాక్టర్‌ ఎం. శ్రీనివాసరావు, ఐజీవై ఇమ్యునోలాజిక్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ డాక్టర్‌ ఆదినారాయణరెడ్డి సంతకాలు చేశారు. వచ్చే సంవత్సరం నుంచి ఆ ప్రాంతంలో వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌ ప్రారంభం కానుంది.

కాగా, ఈ యూనిట్‌లో పశువులకు సంబంధించిన అన్ని రకాల వ్యాక్సిన్లు తయారు కానున్నాయి. గొర్రెల్లో చిటెక రోగం, బొబ్బర్ల రోగం, పీపీఆర్‌, పశువుల్లో వచ్చే గొంతువాపు, జబ్బ వాపు, గాలికుంటు వ్యాధి, బ్రూసిల్లా తదితర వ్యాధులకు వ్యాక్సిన్లు అక్కడ తయారు కానున్నాయి. ఈ యూనిట్‌కు ఐజీవై దాదాపు రూ.50 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఈ వ్యాక్సిన్ల తయారీ యూనిట్‌లో వంద మంది నిపుణులు, సిబ్బందికి ఉపాధి కలగనుంది. ఈ యూనిట్‌ లో తయారయ్యే వ్యాక్సిన్లను ఇతర రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసేలా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది.

Next Story