రెండు త‌ల‌ల శిశువు జ‌న‌నం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Nov 2019 8:36 AM GMT
రెండు త‌ల‌ల శిశువు జ‌న‌నం

అప్పుడ‌ప్పుడు కొన్ని వింత సంఘ‌ట‌న‌లు జ‌రుగుతూ ఉంటాయి. ఈ సంఘ‌ట‌న‌లు కూడా అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురిచేసేలా ఉంటాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిషా జిల్లాలో ఓ మహిళకు రెండు తలల బిడ్డకు జన్మనిచ్చింది. గంజ్‌బాసోడా ఏరియాకు చెందిన బాబిత అహిర్వార్ అనే 22 ఏళ్ల మహిళకు సంవతసరం క్రితం వివాహం అయ్యింది. అనంతరం గర్భం దాల్చిన బాబితకు ఆదివారం రాత్రి మగ బిడ్డకు జన్మనిచ్చింది. కాగా, ఆ శిశువుకు రెండు తలలు, మూడు చేతులు ఉన్నాయి. ఇది చూసిన కుటుంబీకులు, జ‌నాలు ఆశ్య‌ర్య‌పోయారు. రెండు తలలకు కూడా కళ్లు, చెవులు, నోరు ఉన్నాయి. కాగా..ఈ వింత శిశువు ఆరోగ్య ప‌రిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. తల్లి బాబితా ఆరోగ్యం ప‌రిస్థితి బాగానే ఉన్న‌ట్లు వైద్యులు చెబుతున్నారు. బాబితా గర్భంతో ఉన్నప్పుడు స్కానింగ్ చేసిన వైద్యులు కవలలు అని నిర్ధారించుకున్నారు.

కానీ ప్ర‌సూతి తర్వాత రెండు తలల శిశువును చూసి డాక్టర్లు కూడా షాక్‌కు గుర‌య్యారు. ఇలాంటి శిశువులు మిలియన్‌ మందిలో ఒకరికి ఇలా జన్మించే అవకాశం ఉందని వైద్యులు పేర్కొన్నారు.

Next Story