ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నం
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 25 Dec 2019 4:05 PM ISTహైదరాబాద్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. ట్రాన్స్‌జెండర్‌పై ఆటోడ్రైవర్ అత్యాచారయత్నానికి ఒడిగట్టాడు. వివరాళ్లోకెళితే.. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మహేశ్ అనే ఆటోడ్రైవర్ హిజ్రాపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. మంగళవారం రాత్రి తన ఆటో ఎక్కిన ఆ ట్రాన్స్‌జెండర్‌పై ఆటో డ్రైవర్ ఈ దారుణానికి యత్నించినట్లు తెలుస్తోంది.
ఆటోడ్రైవర్ బారి నుంచి తప్పించుకున్న ట్రాన్స్‌జెండర్ ఇతర హిజ్రాలకు జరిగిన విషయం తెలియజేసింది. దీంతో రెచ్చిపోయిన హిజ్రాలు బుధవారం ఆటోడ్రైవర్ మహేశ్‌ను పట్టుకుని దేహశుద్ధి చేశారు. అనంతరం అతడిని బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
Next Story