తమిళనాడులో కూతురి స్నేహితురాలి చేతిలో ఓ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. తిరువొత్తియారులోని సాత్తుమానగర్‌ ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. కర్పూరం హోల్‌సేల్‌ వ్యాపారి అమ్మన్‌శేఖర్‌ కుటుంబం కొన్నేళ్ల క్రితం చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. అమ్మన్‌ రాజశేఖర్‌కు భార్య, కూతురు ఉన్నారు. కాగా కూతురి స్నేహితురాలు ప్రతి రోజు ఇంటికి వస్తూ వెళ్లేది. ఈ క్రమంలో ఆ యువతిపై కూతురి తండ్రి అమ్మన్‌శేఖర్‌ కన్ను పడింది. ఆ యువతితో ఎలాగైన లైంగిక వాంఛ తీర్చుకోవాలనుకున్నాడు. యువతికి గిఫ్ట్‌లు కొనిస్తూ మచ్చిక చేసుకున్నాడు. అతడు కొనిస్తున్న గిఫ్ట్‌లకు యువతి లొంగిపోయింది. కొంత కాలంగా ఇద్దరు వివాహేతర సంబంధం నడించారు. బయటి ప్రదేశాలకు వెళ్లి సేద తీరి వచ్చేవారు. ఇలా సరదగా గడిపిన క్షణాలను అమ్మన్‌శేఖర్‌ తన కెమెరాలో బంధించుకున్నాడు.

ఇదిలా ఉంటే యువతి పవిత్రకు తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. విషయం తెలుసుకున్న వ్యాపారి శేఖర్‌ పెళ్లి చేసుకోవద్దని యువతికి సూచించాడు. పెళ్లి చేసుకుంటే ఏకాంత సమయంలో తీసుకున్న అశ్లీల వీడియోలు బయటపెడతానని బెదిరింపులకు గురి చేశాడు. శేఖర్‌కు ఆ యువతి నచ్చజెప్పాలని చూసింది. ఎంత చెప్పినా వినకపోవడంతో శేఖర్‌పై యువతి ఆగ్రహించింది. పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేయడానికి నిర్ణయించుకుంది. బెసంట్‌ నగర్‌ ప్రాంతాల్లో సరదా గడిపేందుకు బయటకు వచ్చారు. ఈ క్రమంలో గిప్ట్‌ ఇస్తానని కళ్లు మూసుకోవాలని శేఖర్‌ను యువతి కోరింది. దీంతో కళ్లుమూసుకున్న శేఖర్‌పై యువతి మత్తు మందు చల్లింది. బ్యాగులో తెచ్చుకున్న కత్తితో వ్యాపారి శేఖర్‌ను పొడిచి హత్య చేసింది. శేఖర్‌ సృహాతప్పి పడిపోయిన తర్వాత యువతి అక్కడి నుంచి పరారు అయ్యింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.