రాశి ఫలాలు : 23-8-2020 ఆదివారం నుండి 29-8-2020 శనివారం వరకు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 Aug 2020 2:24 AM GMT
రాశి ఫలాలు : 23-8-2020 ఆదివారం నుండి 29-8-2020 శనివారం వరకు

విశేష పర్వ దినములు

  • 23-8-2020 ఆదివారం నుండి 29-8-2020 శనివారం వరకు
  • 23-8-2020 ఆదివారం ఋషిపంచమి అగస్త్యోదయం.
  • 24-8-2020 స్కంద షష్టి, సూర్య షష్టి.
  • 25-8-2020 అముక్తాభరణ సప్తమి.
  • 27-8-2020 నంద నవమి, కేదార నవమి, అభిర్నవమి,
  • 29-8-2020 శనివారం మతత్రయ ఏకాదశి, వామన జయంతి, పరివర్తన ఏకాదశి

మేష రాశి :- ఈ రాశి వారికి విశేష ధన లాభం సౌఖ్యము ఇవన్నీ వీరిని ఆనందంలో ముంచెత్తుతూ ఉంటాయి. లగ్నంలో ఉన్న కుజుడు లగ్న అష్టమ ఆధిపత్యం కనుక అతను ఇబ్బందులు మాత్రం కలగజేసిన భయభ్రాంతులకు గురి కానివ్వకుండా మంచి ఫలితాలను వారాంతాల్లో ఇవ్వనున్నాడు . అలాగే పంచమంలో ఉన్నా రవి బుధులు కూడా కొంచెం ఇబ్బంది గురిచేస్తారు. గురు శుక్రులు వీరికి ధన లాభం సూచిస్తున్నా దానికితోడు చంద్రుడు వారాంతంలో గురునితో కలిసినప్పుడు మరింత ఆనందాన్ని ధనసంపాదన ఇస్తాడు. వీరికి మానసిక దౌర్బల్యం మాత్రం ఎన్నటికీ ఉంటుంది. రాజ్యశని అనుకోని చిక్కుల్ని కలుగజేస్తూ ఇబ్బంది పెడతాడు అలాగే కేతువు కూడా శత్రువృద్ధి చేస్తున్నాడు. వీరు ఈ వారంలో 48 శాతం మాత్రమే ఫలితాలని పొందగలుగుతున్నారు. బుధ గురువారాల్లో పేరు కొంచెం ఇబ్బంది ని ఎదుర్కొనే అవకాశం ఉంది. ఈ వారంలో మీకు 48శాతం శుభ ఫలితాలు వర్తిస్తాయి. అశ్విని నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయింది కాబట్టి ఫలితాలు కొంచెం తక్కువగా ఉన్నాయి మానసిక ఇబ్బందులు ఎక్కువగా ఉంటుంది భరణి నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది కాబట్టి మంచి ఫలితాలు పొందుతున్నారు కృత్తిక 1వ పాదం వారికి మాత్రమే ఉంది కాబట్టి ఈ ఫలితాలు వర్తిస్తాయి.

పరిహారం :- 26వ తేదీ *దూర్వాష్టమి* గరికపోచలతో ఓంకారం చేసి *ఓం గం గణపతయే నమః* అని చెబుతూ పుష్ప అర్చన చేయండి. 29 వ తేదీ *పరివర్తన ఏకాదశి* ఉపవాసం ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృషభ రాశి :- ఈ రాశి వారికి విశేష సౌఖ్యము జయము భూషణము ఇవి ఆనందాన్ని కలిగిస్తునప్పటికీ గ్రహాల ప్రతికూలత ఎక్కువగా ఉంది. వీరికి ఈ వారంలో శారీరక మానసిక ఇబ్బందులు ఉన్నాయి. అనారోగ్యం ఎక్కువగా సూచిస్తోంది. కారణంగా మీరు ఇతరుల చేత మాట పడే అవకాశాలు కూడా ఉన్నాయి. విలువైన వస్తువులను పోగొట్టుకొనే అవకాశం కూడా లేకపోలేదు. అనవసరంగా ఖర్చు మీకు ఈ వారంలో పెరుగుతున్నాయి. మీరు జాగ్రత్త వహించక పోయినట్లయితే ఈ ప్రభావం భవిష్యత్తులో ఇబ్బందిని సూచిస్తోంది. వారాంతంలో గురు చంద్రుల కలయిక కేతువు యొక్క కలయిక మీకు ధనవ్యయాన్ని సూచిస్తున్నాయి. విలువైన సమయాన్ని వృధా పనులు కాలక్షేపాలు తోనూ దుర్వినియోగం చేస్తారు. కాబట్టి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఉపయోగించినట్లయితే సత్ఫలితాలు పొందుతారు. ఈ వారంలో మీకు 30 శాతం మాత్రమే శుభఫలితాలు ఉన్నాయి. కృత్తిక 2 3 4 పాదాలు వారికి విపత్తార అయింది కాబట్టి ప్రతికూలతలు ఉన్నాయి రోహిణి నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది కాబట్టి ధనాదాయం బాగుంటుంది మృగశిర 1 2 పాదాలు వారికి చిన్న అనారోగ్య సూచన ఉంది జాగ్రత్త వహించండి.

పరిహారం :- సోమవారం నాడు దేవాలయంలో గాని ఇంటి దగ్గర గాని తెల్లని వస్త్రము బియ్యం దానం చేయండి. భాగ్యశని ప్రభావం తగ్గడానికి నల్లనువ్వులు నల్లని వస్త్రాలు నువ్వుల నూనె దానం చెయ్యండి.

మిధున రాశి :- ఈ రాశి వారికి సంపద ధన ప్రాప్తి శరీర సౌఖ్యము ఆనందాన్ని కలిగించి సుఖప్రదమైన వాతావరణంలో మిమ్మల్ని నడిపిస్తాయి. చంద్రుడు ప్రతి పని ఆటంకపరచు కొనే లాగా మానసికంగా మీకు మీరే ఇబ్బంది కలిగించుకుంటారు. వారాంతంలో విలువైన వస్తువులను పోగొట్టుకొనే అవకాశం ఉంది. అష్టమ శని ప్రభావము మీకు ఇంటాబయటా ఆందోళనలు ఎక్కువగా సూచిస్తోంది. అయినా గురు శుక్ర ప్రభావం చేత మీరు చాలా ఆనందాన్ని పొందగలుగుతారు. ద్వితీయ శుక్రుడు అష్టమ గురుడు కూడా మీకు కుటుంబ సౌఖ్యాన్ని ఇస్తారు. బుధ కేతువులు మీకు శత్రుపీడ శత్రు వృద్ధి ఎక్కువగా ఒత్తిడి కలిగిస్తారు. ఈ వారంలో మీకు 48 శాతం శుభఫలితాలు పొందే అవకాశం కనిపిస్తోంది. మృగశిర 3 4 పాదాలు వారికి జన్మతార ఫలితాలు వ్యతిరేకంగా ఉన్నాయి. ఆరుద్ర నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది శుభ ఫలితాలు పొందగలుగుతారు. పునర్వసు 1 2 3 పాదాలు చాలా మంచి శుభవార్తను పొంది దిగ్విజయంగా కొనసాగుతారు.

పరిహారం :- అష్టమ శని కి జపం చేయించండి. శనివారం నాడు ఉపవాసం ఉండి ఆదివారం నాడు బ్రాహ్మణులకు వస్త్ర అన్నదానం చేయండి.

కర్కాటక రాశి :- ఈ రాశివారికి విశిష్ట ధనలాభము సంతోషము ఉత్సాహము సుఖజీవితం ఈ వారంలో ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. వీరి ఆలోచనలు అన్నీ కూడా ముందుకు సాగే అవకాశం ఎక్కువగా ఉంది. అయితే మానసిక దౌర్బల్యాన్ని పొందకూడదు. సంతోషంగా ఉంటున్న కొద్దీ మీకు మరింత ఉత్సాహము వచ్చే అవకాశం ఉంది. అది దృష్టిలో పెట్టుకోండి. సప్తమ శని ప్రభావము కించిత్ అనారోగ్యాన్ని సూచిస్తుంది. పనులకు ఆటంకాలు ఎక్కువగా కనిపిస్తాయి కానీ అవి మీకు పరీక్షా సమయంగా మీరు గుర్తించినట్లయితే సుఖజీవితం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. మీరు ఈ వారంలో 56 శాతం శుభ ఫలితాలు పొందగలుగుతున్నారు. పునర్వసు నాలుగో పాదం వారికి పరమమిత్ర తార అయ్యింది. ఫలితాలు చాలా బాగున్నాయి. పుష్యమి నక్షత్ర జాతకులకు నైధనతార ఫలితాలు వ్యతిరేకంగా కనిపిస్తున్నాయి. ఆశ్లేష నక్షత్ర జాతకులకు మాత్రము సాధనం కార్యసాధన అన్నట్టుగా మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారము :- 24వ తేదీ స్కంద షష్టి సుబ్రహ్మణ్య పూజలు జరిపించండి. సూర్య షష్టి కూడా అయింది కనుక రవి కూడా పూజలు జరిపిస్తే మీలో ఉన్న భయం పోగొడతాడు.

సింహ రాశి :- ఈ రాశి వారికి ధన లాభం ఈ వారంలో ఎక్కువగా ఉండి ఆనందాన్ని పొందే అవకాశం కనిపిస్తోంది. అయితే స్థానచలనం కూడా ఉంది. ఏదో పని మీద వేరే చోటికి వెళ్ళవలసిన పరిస్థితి కూడా వస్తుంది. బుధ ప్రభావంచేత చిక్కులు పొందు తున్నారు. అలాగే కుజ ప్రభావం చేత మీరు అనుకోని ఇబ్బందులు పడవలసి వస్తుంది చరస్థిర ఆస్తులు నష్టపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. శుక్ర గురులు ఈ వారంలో అనుకూలంగా పని చేయడం వల్ల సిరిసంపదలు లభిస్తాయి. కొంత ద్రవ్యాన్ని ఖర్చుపెట్టి గౌరవ మర్యాదలు నిలబెట్టుకో గలుగుతారు. చంద్ర ప్రభావం చేత అనుకోకుండా కార్యాన్ని వాయిదా వేసి ఫలితం నష్టపోతారు. ఈ వారంలో వీరు 46 శాతం మాత్రమే శుభ ఫలితాన్ని పొందగలుగుతున్నారు. మఖా నక్షత్ర జాతకులకు ప్రత్యక్తార అయింది. పుబ్బా నక్షత్ర జాతకులకు క్షేమ తార అయింది శుభఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తర ఒకటో పాదం వారికి విపత్తార అయింది వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి.

పరిహారం: 26 8 2020 బుధవారం దూర్వాష్టమి అని అంటాం. గణపతిని గరికపోచలతో చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి శనివారం నాడు వామనజయంతి ఏకాదశి ఉపవాసం చేయండి.

కన్యా రాశి :- ఈ రాశి వారు కుటుంబంతో హాయిగా ఆనందంగా ఉంటారు గానీ రవి చంద్రులు ఇద్దరు కార్యహానిని సూచిస్తున్నారు. వీరి ప్రభావం చేత మీలో అసక్తి దుర్జనత్వం పెరిగి పనులను కూడా వాయిదా పడతాయి. దూరమైన నిర్ణయాలపై స్థిరంగా ఉండలేక పోవడం ఈ వారంలో కనిపిస్తోంది. అనారోగ్యం కూడా ఉంది మీరు. ఎందుకైనా మంచిది ఒకసారి రక్త పరీక్ష జరిపించుకోండి. శస్త్ర చికిత్స పొంద కుండా ఉండాలి అంటే కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పదవ ఇంట్లో ఉన్న శుక్రుడు మీకు సంతోషం కలిగిస్తాడు కానీ గురు ధన నష్టాన్ని సూచిస్తున్నాడు. ఐదు ఇంట్లో శని సంతానం ఇబ్బంది కలిగిస్తుంది. మీ గౌరవానికి కూడా భంగం కలిగే అవకాశం కనిపిస్తోంది. మొత్తంమీద ఈ వారంలో మీరు 24 శాతం మాత్రమే శుభఫలితాలను పొందగలుగుతారు. మీ మాటకు విలువ కూడా తగ్గుతుంది కొంచెం జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడటం చాలా అవసరం. ఉత్తర 2 3 4 పాదాలు వారికి ప్రత్యక్ తార అయింది ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి.హస్త నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి చిత్త 1 2 పాదాలు వారికి జన్మ తార అయింది అనారోగ్య సూచన ఉంది.

పరిహారం :- శివునికి రుద్రాభిషేకం 26వ తేదీ బుధవారం నాడు దూర్వాష్టమి. గరికెతో గణపతిని తయారుచేసి గరికతో అర్చన చేయండి.

తులా రాశి :- ఈ రాశి వారికి ధనలాభం కుటుంబ సౌఖ్యమును ఆనందము సుఖ సంతోషాలతో జీవితాన్ని గడిపే అవకాశం కనిపిస్తోంది. గురు చంద్రుల కలయిక గురు శుక్ర వారాల్లో కొంత నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఆ రోజు ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది. శుక్ర ప్రభావం చేత ఆనందం కలుగజేసి స్థిరచరాస్తులు ఇస్తాడు. కుజుడు ప్రతి పనికి ఆటంకం కలిగించడంతో మీరు నిరుత్సాహపడకుండా ముందుకు వెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. కడుపునొప్పి అవకాశం ఎక్కువగా ఉంది అది శని ప్రభావం చేత. రాహువు ప్రభావం చేత మీకు శత్రువులు ఎక్కువగా ఉంటారు కాబట్టి నిదానంగా మీరు మాట్లాడి మీ పని మీరు నెరవేర్చవలసిన అవసరం ఉంది. ఈ వారంలో 48 శాతం శుభ ఫలితాలను పొందగలుగుతున్నారు. చిత్త 3 4 పాదాలు వారికి అనారోగ్య సూచన ఉండగా స్వాతి నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది కొంచెం మంచి ఫలితాలు ఉన్నాయి. విశాఖ 1 2 3 పాదాలు వారికి మిత్ర తార అయింది. చాలా మంచి ఫలితాలు కలుగుతాయి.

పరిహారం :- శనికి జపం చేయించండి నల్లనువ్వులు దానం చేయండి. స్త్రీలు ఒక బ్రాహ్మణ స్త్రీకి భోజనం పెట్టండి. ఏకాదశి ఉపవాసం మంచి ఫలితాన్ని ఇస్తుంది.

వృశ్చిక రాశి :- ఈ రాశి వారికి కుటుంబం లాభం ఆనందంతో సంతోషం పిల్లలు పెద్దలు తో గడుపుతారు. రవి ప్రభావం చేత కార్యజయం తోనే ప్రారంభమై ఈ వారంలో గొప్ప ఆనందం కలుగుతుంది. ఒక కోర్టు వ్యవహారాలు గానీ లేదా పెండింగ్ కేసులు ఏమైనా ఉన్నా సరే చర స్థిర ఆస్తులు ఇటువంటి విషయాలు సమస్య ఏమైనా సరే పూర్తి పరిష్కార మార్గం లోకి వచ్చేస్తాయి. అయితే ఒకసారి మీరు అకారణంగా కలహములు తెచ్చుకొనే అవకాశం కూడా అదే సమయంలో లేకపోలేదు. ఏదో ఒక విలువైన వస్తువు మాత్రం పోగొట్టుకుంటారు. గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండడం వల్ల 72% శుభ ఫలితాలను పొందగలుగుతున్నారు. . విశాఖ 4వ పాదం వారికి మిత్ర తారైంది పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. అనురాధ నక్షత్ర జాతకులకు నైధనతార అయింది కాబట్టి వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తుంది.

పరిహారం :- మీరు రాహు కేతువులకు అర్చన చేయండి లేదా అని 27. 8. 2020 గురువారం పడింది ఆరోజు సర్ప సూక్తం పఠించండి.

మంచి ఫలితాలు కలుగుతాయి శనివారం నాడు ఏకాదశి ఉపవాసం మంచిది.

ధను రాశి :- ఈ రాశి వారికి సౌఖ్యము కుటుంబ ఆనందము వారం మొత్తం మీద పొందగలుగుతారు. 9 వ ఇంట రవి ప్రభావం చేత కష్టాన్ని అనుభవించక తప్పదు. శత్రువులు మిమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడతారు. బుధ ప్రభావం చేత ద్రవ్య నష్టం కలుగుతోంది. మీకు శరీరారోగ్యాన్ని లేదా మీ కుటుంబంలో ఎవరికైనా స్త్రీలకు శరీర ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంది. శుక్ర శని ప్రభావం చేత ఆస్తి నష్టం తను ధన మాన ప్రాణాలు ఇబ్బందులు కలిగించి పెద్ద నష్టాన్ని సూచిస్తున్నాయి. ఈ వారంలోనే. మీలో ఇంతకుముందున్న ధైర్యం కూడా తగ్గిపోతున్నాయి. శత్రు వృద్ధి ఎక్కువగా ఉంది కాబట్టి మాట పట్టింపులకు పోకుండా అనుకూల పరిస్థితుల కోసం ఎదురు చూడండి. కాలాన్ని సామాన్యంగా వినియోగించుకోండి కొత్త పనులను వెంటనే తల పెట్టకండి. గ్రహాల ప్రతికూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి అంతేకాదు 24 శాతం మాత్రమే ఈ వారం లో శుభ ఫలితాలు ఉన్నాయి. మూలా నక్షత్ర జాతకులకు ప్రత్యక్ తార అయితే ప్రతికూల ఎక్కువగా ఉంది పూర్వాషాఢ నక్షత్ర జాతకులకు చాలా బాగుంది ఉత్తర 1వ పాదం వారికి మాత్రమే కనిపిస్తున్నాయి.

పరిహారం :- నవగ్రహాలకు అర్చన చేయించండి సోమవారం నాడు స్కంద షష్టి శివుని కు లేదా సుబ్రమణ్య స్వామి నాకు అభిషేకం చేయించండి శనివారం నాడు ఉపవాసం ఉండండి. బుధవారం నాడు గరికతో గణపతి అర్చన చేయించండి.

మకర రాశి :- ఈ రాశి వారికి కుటుంబసౌఖ్యము ఇష్టాపూర్తి వీటితో వీరికి ఈ వారం శుభప్రదంగా సాగిపోతుంది. అయితే అష్టమ రవి వీరికి ప్రతికూలతని సూచిస్తూ అనారోగ్యాన్ని ఎక్కువగా కలుగజేస్తాడు. కుజ గురు శుక్రులు ముగ్గురు వాళ్లు ఉన్న స్థానాన్ని బట్టి అపకీర్తి శత్రుపీడ నష్టము సూచిస్తున్నారు. అయితే రాహు ఒక్కడే అనుకూలంగా ఉండే సుఖజీవితం ఇస్తాడు. ఈ వారంలో చాలా ఇబ్బందికరమైన వ్యవస్థని వీలు ఎదుర్కోక తప్పదు అనిపిస్తోంది. ఏదైనా జాగ్రత్త వహించడమే మార్గము. మాటను నోటిని కట్టుకోవడం అనగా తినడం తగ్గించాలి మాట మాట్లాడడం కూడా మార్చుకోవాలి. వారం మధ్యలో మాత్రం ఆనందాన్ని పొందే అవకాశం లేకపోలేదు. జన్మశని ప్రభావం చేత అనారోగ్య సూచనలు అపకీర్తి ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త వహించండి. గ్రహస్థితులు వివరణ ఎదుర్కోబోతున్న సమస్యలు సూచనలు ఇస్తూ ఉన్నాయి. మీరు 40 శాతం మాత్రమే శుభ ఫలితాన్ని పొందగలుగుతున్నారు. ఉత్తరాషాఢ 2 3 4 పాదాలు వారికి విపత్తార అయింది ప్రతికూల ఫలితాలు ఎక్కువగా ఉన్నాయి. శ్రవణా నక్షత్ర జాతకులకు సంపత్తార అయింది చాలా ఎక్కువ అనుకూలతలు కనిపిస్తున్నాయి. ధనిష్ట 1 2 పాదాలు అనారోగ్య సూచనలు కనిపిస్తున్నాయి.

పరిహారం :- శనికి జపం చేయించండి నల్ల నువ్వులు నల్ల వస్త్రము నువ్వులు నూనె ఉప్పు దానం చేయించండి. బుధవారం నాడు గణపతికి దూర్వాల తోనూ ఓం కారం తయారు చేసి ఓం గం గణపతయే నమః అనే మంత్రం చెబుతూ పుష్పాలతో అర్చన చేయండి ఉండ్రాళ్ళు నైవేద్యం కూడా పెట్టండి.

కుంభరాశి :- ఈ రాశి వారికి సౌఖ్యము ధనలాభము సర్వభోగాలు వీటితో శుభప్రదంగా ఈ వారం సాగుతుంది. ఆరవ ఇంట్లో రవి ఇంకొక పెద్ద కష్టాన్ని సూచనప్రాయంగా ఇస్తాడు. కుజ బుధ గురు శుక్రులు వారు ఉన్న స్థానాన్ని బట్టి మీకు సకల శుభాలతో పాటు బంధుమిత్రుల దర్శనము ఇవన్నీ కలిగిస్తారు. చంద్రుడు మంచి చెడులకు కూడా కారకుడవుతాడు. 12 ఇంట్లో వ్యయమందున్న

శని మాత్రము మీకు అనేక ఇబ్బందులు కలుగ చేసి మీ తెలివి తేటలకు పరీక్ష పెడతాడు. సాధ్యమైనంత వరకూ అన్ని పనులకూ వాటికి సంబంధించిన ప్రయత్నాలు మాత్రం వాయిదా వేయకండి. ఒక మధ్యవర్తి ద్వారా మీరు కొంత లాభం పొందగలుగుతారు. ఆ మధ్యవర్తి మీకు మిత్రుడు కుటుంబపరంగా కావాల్సిన వాడు అవుతాడు. మీకు ఈ వారంలో 56 శాతం శుభ ఫలితాలు లభించనున్నాయి. ధనిష్ట 3 4 పాదాలు వారికి జన్మతార అయింది అనారోగ్య సూచన ఉంది. శతభిషా నక్షత్ర జాతకులకు పరమమిత్ర తార అయింది ఫలితాలు బాగున్నాయి. పూర్వాభాద్ర నక్షత్రం 1 2 3 పాదాలు వారికి మిత్ర తార అయింది చాలా శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి.

పరిహారం :- శని జపం చేయించండి నల్ల నువ్వులు నూనె దానం చేయండి. సోమవారం రుద్రాభిషేకం మంచిది. బుధవారం నాడు గరికతో గణపతి అర్చన చేయండి. శనివారం ఏకాదశి ఉపవాసం ఉండండి.

మీన రాశి :- ఈ రాశి వారికి విశేష ధనము లాభము సౌఖ్యము ఆనందాన్ని ఆశ్చర్యాన్ని కలిగించే వారం. రవి శత్రు వినాశనానికి కారణం అయితే బుధుడు మీకు అలంకారాన్ని ఇచ్చేందుకు అవకాశం కల్పిస్తాడు కాబట్టి మీరు ఆనందాన్ని ఈ వారంలో పొందగలుగుతారు. అంతేకాదు చంద్రుడు కూడా వారాంతాల్లో మీకు సుఖాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. కుటుంబంతో హాయిగా ఆనందంగా ఉండే రోజులు ప్రారంభమయ్యాయి. విశేష ధన సంపదలు పెరుగుతాయి. అయితే గురు అనుగ్రహము అనగా దైవానుగ్రహం మీకు కొంచెం తక్కువగా ఉందని చెప్పాలి. కుటుంబంలో పెద్దలకు అపమృత్యు భయం ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్తగా వ్యవహరించి వారికి కావలసిన సేవ అందజేసినట్లు అయితే అని మీకు అగౌరవం లేకుండా సంఘంలో గౌరవ మర్యాదలు పెంచుతూ మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. ఇవాళ మీకు 48 శాతం మాత్రమే శుభఫలితాలు ఉంటాయి. పూర్వాభాద్ర 4వ పాదం వారికి మిత్ర తార అయింది శుభఫలితాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు నైధన తార అయింది ప్రతికూల పరిస్థితులే ఎక్కువగా ఉన్నాయి. రేవతి నక్షత్ర జాతకులకు సాధన తార అయింది కాబట్టి పరిస్థితులను అనుకూలంగా మారుతున్నాయి.

పరిహారం :- మీరు స్కంద షష్టి సోమవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ గాని లేదా శివునికి అభిషేకం చేయించుకోండి. శనివారం నాడు ఏకాదశి ఉపవాసం మంచిది. బుధవారం నాడు దూర్వాలతో గణపతి అర్చన చేయండి.

Next Story