ద‌ర్శ‌కుడు ఆర్జీవీ ఆఫీస్‌పై దాడి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  23 July 2020 7:58 PM IST
ద‌ర్శ‌కుడు ఆర్జీవీ ఆఫీస్‌పై దాడి

వివాద‌స్ప‌ద ద‌ర్శ‌కుడు రాంగోపాల్‌వర్మ(ఆర్జీవీ) ఆఫీస్‌పై జనసేన గుర్తుతెలియ‌ని వ్య‌క్తులు దాడి చేశారు. ఈ ఘటనతో ప్రమేయమున్న కొంత‌మందికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రామ్‌గోపాల్‌ వర్మ ప్ర‌స్తుతం ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఈ సినిమా మ‌రో రెండు రోజుల్లో ఓటీటీ ప్లాట్‌ఫాం ద్వారా విడుద‌ల కానుంది. వ‌ర్మ‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదిలావుంటే.. ప‌వ‌ర్ స్టార్ సినిమాపై పవన్‌ అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఈ దాడికి పాల్పడ్డారనే క‌థ‌నాలు ప‌లు మీడియా ఛాన‌ల్స్‌లో వెలువ‌డ్డాయి. ఈ విష‌య‌మై పూర్తి వివ‌రాలు తెలియాల్సివుంది. మరోవైపు ‘ప‌వ‌ర్ స్టార్: ఎన్నిక‌ల ఫ‌లితాల త‌ర్వాత క‌థ‌‌’ చిత్రానికి కౌంటర్‌గా రామ్‌గోపాల్‌ వర్మపై హీరో పవన్‌ కల్యాణ్‌ అభిమానులు పరాన్న జీవి పేరుతో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన ప‌స్ట్‌లుక్ పోస్ట‌ర్ కూడా విడుద‌లైంది.

Next Story