వార ఫలాలు : ది. 7వ తేది నుంచి ది. 13వ తేది వరకూ..

March 2nd Week Astrology. ఈ వార ఫలాలు : ది. 7వ తేది నుంచి ది. 13వ తేది వరకూ..

By Medi Samrat  Published on  7 March 2021 8:59 AM GMT
Raasi Palalu

వారంలో ముఖ్యమైన రోజులు

9-03-21: మతత్రయ ఏకాదశి

10-03-21: ప్రదోష వ్రతం, తిల ద్వాదశి

11-03-21: మహాశివరాత్రి

మేషం రాశి : ఈ వారంలో మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగాల వారికి అనుకూలవాతావరణం ఉంటుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు.బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది.నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్దులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శరీర ఆరోగ్యం కుడుటపడుతుంది.ఆర్ధిక వ్యవహరాలలో జయం కలుగుతుంది.ఆదాయానికి లోటు ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.సన్నిహితులతో కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు కలుగుతాయి.దూరప్రాంత ప్రయాణాలు వాహన ఇబ్బందులు కలుగుతాయి.అందరిని గుడ్డిగా నమ్మి మోసపోతారు.

పరిహారం : శివారాధన, మన్యు సూక్త పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

వృషభ రాశి : ఈ వారం అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్ట కార్యసిద్ధి కలుగుతుంది. ధనలాభం సూచనలు ఉన్నవి సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది.విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు.సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు.వృత్తి వ్యాపారాలలో ఇతరుల పై ఆధిక్యతను సాధిస్తారు.నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను పొందుతారు.ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి.విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు.దూర ప్రాంతం నుండి సంతోషకర వార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్య లాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు కలసివస్తాయి.కోర్టు వ్యవహారాలలో విజయం సాదిస్తారు.ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి.

పరిహారం : దేవిఖడ్గమాల పూజ చేయించడంవలన శుభ ఫలితాలను పొందగలుగుతారు.

మిథున రాశి : ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.ఒత్తిడి పెరుగుతుంది.ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి.అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించక పోవటం వలన అనుకున్న పనులను పూర్తి చేయలేరు. ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. కానీ కొద్ది రోజుల తరువాత ఆర్థికంగా కొంత స్థిరత్వం కలుగుతుంది.ఆరోగ్యం సహకరిస్తుంది దీర్ఘకాలిక సమస్యలను తొలగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు.సంతాన విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి.గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది.కోర్టు వ్యవహారాలు విజయం పొందుతారు.నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ధన ధాన్య లాభాలు ఉన్నవి.కుటుంబ ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలసి వస్తాయి.

పరిహారం : ఆంజనేయస్వామిని సింధూరంతో పూజించడం వలన శుభఫలితాలను పొందుతారు.

కర్కాటక రాశి : ఈ రాశి వారికి ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు క్రమక్రమంగా పరిస్థితి అనుకూలిస్తుంది.ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉంటాయి.విద్యా సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు.బంధు మిత్రుల నుండి సంతోషకరమైన వార్తలు అందుతాయి.ప్రభుత్వ సంబంధిత వ్యవహారాలలో అనుకూల ఫలితాలు పొందుతారు.వృత్తి వ్యాపారాలలో శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు. వ్యవహార విజయం కలుగుతుంది.ఆర్థిక ఒడిదుడుకులు నుంచి బయటపడతారు నూతన వస్త్ర ప్రాప్తి. దూరప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు .

పరిహారం : సాయి సచ్చరిత్ర పారాయణ చేయడం వలన ఫలితాలను పొందుతారు.

సింహ రాశి : ఈ రాశివారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు.వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.ధన విషయాలలో లోటుపాట్లను అధిగమిస్తారు వివాదాలకు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు.నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి.బంధు మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు.సంతానం విద్యా విషయాలలో శుభఫలితాలను పొందుతారు. భూ సంబంధిత క్రయవిక్రయాలలో ధనలాభం కలుగుతుంది ద్వితీయార్థంలో దూరప్రాంత ప్రయాణాలు లో వాహన ప్రమాదం సూచనలుఉన్నవి. సన్నిహితులతో అకారణ వివాదాలు కలుగుతాయి.వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి.ఆరోగ్య విషయాలలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన మనశ్శాంతి ఉండదు.రుణ ఒత్తిడి పెరిగి ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి.

పరిహారం : శివాలయంలోరుద్రాభిషేకం చేయించడంవలన శుభ ఫలితాలను పొందుతారు.

కన్య రాశి : ఈ వారం చాలా అనుకూలంగా వుంటుంది.నూతన పనులు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు.కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి.ఆరోగ్య విషయాలలో శ్రద్ద వహించాలి. వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందారు. సంతానం విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలంగా సాగుతాయి.నూతన పరిచయాలు వలన కొత్త పనులు ప్రారంభిస్తారు. ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది.వివాదాలలో కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి.ఆకస్మిక ధన లాభం కలుగుతుంది నూతన గృహం కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం మంచిది.

పరిహారం : కృష్ణాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి : ఈ వారం మీకు అంతగా అనుకూలించదు చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది .స్త్రీసంబంధసమస్యలలో చిక్కుకుంటారు కుటుంబ వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి.అవసరానికి కష్టం మీద ధన సహాయం లభిస్తుంది.ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబమునకు కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు జరుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కొన్ని ఆలోచనలో ఆకస్మిక మార్పులు చేస్తారు .ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. బాగస్వామ్య వ్యాపారాలు నష్ట సూచనలున్నవి.

పరిహారం : వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితాలు.

వృశ్చికం రాశి : ఈ వారం ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గందరగోళ పరోస్థితులు ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు క్రమ క్రమంగా తొలగుతాయి. సంతానం ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ వహించాలి. పనులలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి.బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి సోదరులతో సఖ్యత లోపిస్తుంది.వాహన మరమ్మతులు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. ముఖ్యమైన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు.కుటుంబ సభ్యులు సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది.

పరిహారం : సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితాలను పొందుతారు..

ధను రాశి : ఈ వారం అనుకూల ఫలితాలు ఉంటాయి. చేయు వృత్తి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు.బంధు మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు.కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు దూరప్రాంత ప్రయాణాలు కలసి వస్తాయి.విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలను పొందుతారు.దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాల అందుతాయి. రాజకీయ సంబంధిత పదవులను పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ధనాదాయం బాగుంటుంది.

పరిహారం : కాలభైరవాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

మకర రాశి : చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. చేయు వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి.అనారోగ్య నుండి ఉపశమనం లభిస్తుంది.ధైర్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి మంచి ఫలితాలు పొందుతారు.మిత్రులతో సంతోషంగా గడుపుతారు నూతన వాహనం యోగం ఉన్నది.విద్యార్థులు మరింత కష్టపడాలి. శత్రు సంబంధిత సమస్యల పై పైచేయి సాధిస్తారు కుటుంబ సభ్యులు నుండి ఆశించిన సహాయం లభిస్తుంది జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.నూతన వస్తువస్త్ర లాభాలుంటాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు.

పరిహారం : విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన శుభ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి : ఈ వారం కూడా ప్రతికూల వాతావరణం ఉంటుంది చేయు వృత్తి వ్యాపారాలలో నష్టాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. కొన్ని పనుల వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వలన నిందలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో చెయ్యను పనికి విమర్శలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా భాగస్థులు మోసం చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోతాయి.ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. సంతానం విద్యా విషయాలలో అసంతృప్తి కలుగుతుంది. స్ధిరాస్తి వివాదాలు మరింత ఉధృతమవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

పరిహారం : వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయటం వలన శుభఫలితాలను పొందుతారు.

మీన రాశి : ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది.నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి.ఆదాయపరంగా లోటు ఉండదు కానీ ఖర్చు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. అనారోగ్య సమస్యలు ఉంటాయి. సమయానికి నిద్ర ఆహారాలు ఉండవు ప్రయాణాల్లో ఇబ్బందులు ఉంటాయి.నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి.వృత్తి వ్యాపారాలలో ప్రతికూలత పెరుగుతుంది.ముఖ్యమైన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.బంధు మిత్రులకు దూరంగా ఉండటం మంచిది అనిపిస్తుంది.

పరిహారం : దుర్గా ఆరాధన శుభ ఫలితాలను ఇస్తుంది.


Next Story