దిన ఫలితాలు : ఆ రాశి వారు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది..!

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి.

By జ్యోత్స్న  Published on  23 Oct 2023 1:00 AM GMT
దిన ఫలితాలు : ఆ రాశి వారు ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది..!

మేషం:

గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. నిరుద్యోగులకు సంతోషకరమైన వార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

వృషభం:

వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణాలు తీర్చడానికి నూతన రుణాలు చెయ్యవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది.

మిధునం:

ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట గందరగోళ పరిస్థితులు ఉంటాయి. వ్యాపార ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటకం:

కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు విస్తృతమవుతాయి. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

సింహం:

ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయవిక్రయాలలో నూతన లాబాలు అందుకుంటారు. చిన్న నాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.

కన్య:

వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ వాతావరణం కొంత గందరగోళంగా ఉంటుంది. వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

తుల:

సోదరులతో స్థిరాస్థి వివాదాలు కలుగుతాయి. బంధుమిత్రుల మాటలు మానసిక చికాకు కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో పెట్టుబడుల విషయంలో పునరాలోచన చెయ్యడం మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు తప్పవు. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది. ఉద్యోగస్తులు కష్టానికి తగిన ఫలితం లభించదు.

వృశ్చికం:

ఇంటా బయట అనుకూల వాతావరణం ఉంటుంది. విలువైన వస్త్రా,ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారమునకు పెట్టుబడులు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో ఆప్తుల సహాయం అందుతుంది. వృత్తి ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి.

ధనస్సు:

కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార ఉద్యోగాలు ఊహించని స్థాన చలనాలు కలుగుతాయి. రుణదాతలు ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.

మకరం:

నూతన వాహనం కొనుగోలు చేస్తారు. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. చిన్ననాటి మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పనిభారం నుండి ఉపశమనం పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం:

అవసరానికి చేతిలో తగినంత డబ్బు నిల్వ ఉండదు. కొన్ని పనులలో తొందరపాటు నిర్ణయాలు చేసిన నష్టపడతారు. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగ విషయమై అధికారులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం:

స్థిరాస్తి వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. వ్యాపార పరంగా ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి ప్రశంసలు అందుకుంటారు. సంఘంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

Next Story