వార ఫలాలు : ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

Astrology Of This Week. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

By Medi Samrat  Published on  13 Jun 2022 10:04 AM IST
వార ఫలాలు : ఏ రాశి వారికి ఎలా ఉందంటే..

మేషం రాశి : చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. రుణబాధలు తొలగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని కొంత బాధపడతారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు కీలక సమాచారం అందుతుంది. వారం ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. ఆదాయం సరిపడినంత ఉండదు.

పరిహారం : పంచముఖ హనుమత్ కవచం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

వృషభ రాశి : అనుకున్న పనులలో జాప్యం కలిగిన కొంత నిదానంగా పూర్తి అవుతాయి. కుటుంబ విషయంలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. మిత్రుల నుంచి శుభకార్య ఆహ్వనాలు అందుకుంటారు. సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు అనుకూలంగా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంతాన విద్యా విషయంలో కొంత అనుకూల పరిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో కొనసాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి. వారం మధ్యలో వృథాఖర్చులు పెరుగుతాయి.

పరిహారం : సుబ్రహ్మణ్యాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

మిథున రాశి : ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నపటికీ అవసరానికి డబ్బు అందుతుంది. నిరుద్యోగులు ఉద్యోగయత్నాలు వేగవంతం చేస్తారు. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు సాగుతారు. స్థిరాస్తి కొనుగోలు సంభందించి అవరోధాలు అధిగమిస్తారు. ఇంటా బయట పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. పని ఒత్తిడి అధికమై ఇబ్బంది పడతారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థుల శ్రమ మరింత పెరుగుతుంది. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు వలన శ్రమాధిక్యత పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు.

పరిహారం : కనకధారా స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

కర్కాటక రాశి : గృహమున చిత్రవిచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు తీరుతాయి. సకాలంలో ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి. సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు సంతోషం కలిగిస్తాయి. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలలో కొంత పురోగతి సాధిస్తారు. వ్యాపారమున ముఖ్య నిర్ణయాలు తీసుకుని అందరిని ఆశ్చర్యపరుస్తారు. చిన్నతరహా పరిశ్రమలకు సమస్యలు తీరతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు అధికమౌతాయి స్వల్ప అనారోగ్య సూచనలున్నవి. కుటుంబంలో ఒత్తిడులు.

పరిహారం : ఆదిత్య హృదయ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

సింహ రాశి : అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆత్మీయులతో వివాదాలు పరిష్కారమవుతాయి. స్వంత ఆలోచనలు కలసివచ్చి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. ఆర్థిక వ్యవహారాలలో చికాకులు అధిగమిస్తారు. ఇంటా బయట కొన్ని సమస్యల పరిష్కారంలో చొరవ తీసుకుంటారు. నూతన భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. పాత విషయాలు గుర్తుచేసుకుంటారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా సాగుతాయి. వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతల నుండి కొంత వరకు బయటపడతారు. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలున్నవి. బంధువులతో మాట పట్టింపులుంటాయి.

పరిహారం : లక్ష్మీనృసింహ స్వామి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలుంటాయి.

కన్య రాశి : చేపట్టిన పనుల్లో అవాంతరాలు అధిగమిస్తారు. ప్రముఖులతో పరిచయాలు విస్తృతమౌతాయి. దూరపు బంధువులు నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇంటా బయట పరిస్థితులు అనుకూలించి ముందుకు సాగుతారు. స్థిరాస్థి వ్యవహారాలలో సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. వ్యాపారాలు క్రమంగా లాభాలబాట పడతాయి. అన్ని రంగాల వారికీ అనుకూలత పెరుగుతుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమౌతాయి. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి.

పరిహారం : దుర్గా దేవి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.

తుల రాశి : గృహప్రవేశం నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఏ పని ప్రారంభించినా అప్రయత్నంగా పూర్తవుతుంది. వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు గతం కంటే మరింత ఆశాజనకంగా ఉంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఉత్సాహంగా ముందుకు సాగుతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆశించిన పెట్టుబడులు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. వారం మధ్యలో ధనవ్యయ సూచనలున్నవి. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు.

పరిహారం : హనుమాన్ ఆరాధనా చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

వృశ్చిక రాశి : చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక విషయాలు ఆశాజనకంగా సాగుతాయి. దీర్ఘకాలిక రుణాలు కొంతమేర తీరతాయి. నిరుద్యోగులు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. ఆప్తుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సూచనలు ఆచరించడం మంచిది. కుటుంబమున ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు మార్పులు చేస్తారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి ఉద్యోగాలలో జీతభత్యాలు పెరుగుతాయి. వారం ప్రారంభంలో మిత్రుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆరోగ్య సమస్యలు స్వల్పంగా బాధిస్తాయి.

పరిహారం : నవగ్రహ స్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

ధను రాశి : కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. ఇంటాబయట అందరు మీ మాటతో విభేదిస్తారు. సన్నిహితుల ప్రవర్తన కొంత మానసికంగా భాదాకలిగిస్తుంది. సంతాన వివాహ, ఉద్యోగయత్నాలు మందకొడిగా సాగుతాయి. స్థిరాస్తి వివాదాల నుంచి కొంత వరకు బయటపడతారు. వ్యాపారమున తీసుకున్న నిర్ణయాలు అంతగా అనుకూలించవు. ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరిగి సకాలంలో పనులు పూర్తి కావు. గృహనిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. కొన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. ధన వ్యయ సూచనలున్నవి.

పరిహారం : విష్ణు ఆరాధన చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మకర రాశి : నూతనోత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అందరిలోనూ మీకు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు. ప్రత్యర్థులు కుడా అనుకూలంగా మారతారు. స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. వివాహ, ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. కొన్ని వివాదాలు మిత్రుల సహాయంతో పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు గతం కంటే పుంజుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అనుకున్న పదవులు లభిస్తాయి. వారం మధ్యలో ధన పరంగా ఇబ్బందులుంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త అవసరం.

పరిహారం : హయగ్రీవస్తోత్రం పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

కుంభ రాశి : నూతన కార్యక్రమాలను ప్రారంభానికి శ్రీకారం చుడతారు. బంధువుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. పెద్దలతో కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ గూర్చి సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా సాగుతాయి. ఇంటి నిర్మాణయత్నాలలో అవరోధాలు తొలగుతాయి. వ్యాపారులకు నూతన కాంట్రాక్టులు దక్కుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. చిన్న తరహా పరిశ్రమలు లాభసాటిగా సాగుతాయి అన్నిరంగాల వారికీ ఉత్సాహకారవాతావరణం ఉంటుంది. వారం చివరిలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులుంటాయి.

పరిహారం : శివరాధన పారాయణం చెయ్యడం వలన శుభఫలితాలు పొందుతారు.

మీన రాశి : కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కారమవుతాయి. చేపట్టిన పనులలో కొంత జాప్యం కలిగిన నిదానంగా పూర్తి చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు తొలగుతాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్థి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలలో చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నిరంగాల వారి ఆశలు ఫలిస్తాయి. వారం చివరిలో కుటుంబసభ్యులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి. ధన వ్యయ సూచనలున్నవి.

పరిహారం : గణపతి ఆరాధన చెయ్యడం వలన శుభ ఫలితాలు పొందుతారు.


































































































































































































Next Story