చిరంజీవికి ఏం తెలుసు.. అశ్వనీదత్ అగ్రహం..!
By Newsmeter.Network Published on 12 Jan 2020 12:00 PM ISTఅమరావతి: రాష్ట్రంలో జరుగుతున్న ఆందోళనలపై ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖులు స్పందించారు. చిరంజీవి, సింగర్ స్మిత, నారా రోహిత్, పృథ్వీతో పాటు పలువురు మూడు రాజధానులపై తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. తాజాగా మూడు రాజధానుల అంశంపై ప్రముఖ సినీ నిర్మాత అశ్వనీదత్ అన్నారు. ఈ అంశాన్ని సమర్థించడం మూర్ఖత్వమన్నారు. రాజధాని అమరావతిలో రైతులు చేస్తున్న ఉద్యమానికి అశ్వనీదత్ మద్దతు ప్రకటించారు. మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు అశ్వనీద్త్ చేరుకొని సంఘీభావం ప్రకటించారు.
మూడు రాజధానుల అంశానికి సిని హీరో చిరంజీవి మద్దతు తెలపడాన్ని తప్పుబట్టారు. రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అమరావతిలో పర్యటించిన అశ్వనీదత్.. అక్కడి పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న రైతులు, మహిళలపై పోలీసులు ఉక్కుపాదం మోపడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. పోలీసుల్లో నకీలీ పోలీసులు కూడా ఉన్నారంటూ అశ్వనీదత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బహుళ రాజధానుల వ్యవస్థ చాలా చోట్ల విఫలమైందన్నారు. ఈ విషయం తెలిసిన చిరంజీవి కూడా మూడు రాజధానులకు మద్దతు తెలపడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని తెలిపారు.
పవన్ కల్యాణ్ రైతుల కోసం ఎందుకు పోరాడుతున్నారో చిరుకు తెలుసన్నారు. పవన్ సినిమాల్లో నటిస్తే కొట్ల రూపాయలు సంపాదిస్తారని అశ్వనీదత్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే నటుడు ఫృథ్వీ రాజ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించారు. పృథ్వీ లాంటి వారి వల్ల వైసీపీ ప్రభుత్వం బ్రష్టు పట్టిపోతుందన్నారు. ఇలాంటి వ్యక్తులను జగన్ తన పార్టీలో ఉంచుకోవడం దురదృష్టకరమని అశ్వనీదత్ వ్యాఖ్యనించారు. ఉద్యమంలో న్యాయం ఉంటే సినీ హీరోలు తప్పకుండా మద్దుతు తెలుపుతారని అన్నారు. వైఎస్సాఆర్ చేసిన దాంట్లో సీఎం జగన్ 10 శాతం చేసినా చాలని అశ్వనీదత్ వ్యాఖ్యనించారు. బహుళ రాజధానుల వ్యవస్థను సమర్థించడం మూర్ఖతమేనన్నారు.