వార్నర్‌ను ట్రోల్ చేసిన అశ్విన్.. ట్వీట్ వైరల్
By తోట వంశీ కుమార్ Published on 30 Jun 2020 11:44 AM ISTకరోనా మహమ్మారి నేపథ్యంలో లాక్‌డౌన్ కారణంగా క్రికెటర్లు అంతా ఇంటికే పరిమితం అయ్యారు. ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్ లాక్‌డౌన్ కాలంలో టిక్‌టాక్‌లో ఎంట్రీ ఇచ్చాడు. బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేశాడు. తన భార్యతో కలిసి డ్యాన్స్‌లు, డైలాగ్‌లతో అలరించాడు. వార్నర్ డ్యాన్స్‌కు అభిమానులు ఫిదా అయ్యారు. 4.8 మిలియన్ల ఫాలోవర్లతో టిక్‌టాక్‌లో స్టార్‌గా మారాడు వార్నర్.
సరిహద్దులో ఉద్రిక్తతలు కొనసాగుతున్నందున్న కేంద్రప్రభుత్వం టిక్‌టాక్ సహా.. 59 చైనా యాప్‌లను నిషేదిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. కాగా.. సోషల్ మీడియాలో ఈ యాప్‌లపై ఫన్నీ మీమ్స్ వైరల్‌గా మారాయి. తాజాగా భారత స్టార్ స్పిన్నర్ అశ్విన్.. ఐపీఎల్‌లో సన్ రైజర్స్ కెప్టెన్ అయిన డేవిడ్ వార్నర్ ను ట్రోల్ చేస్తూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం అశ్విన్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చైనా యాప్‌లను నిషేదించిన ట్వీట్‌ను షేర్ చేసిన అశ్విన్ వార్నర్‌ను ట్యాగ్ చేశాడు. దీనికి 'అప్ఫో అన్వర్?' అంటూ ఓ ఎమోజీని జతచేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే 13వేల లైకులకు పైగా వచ్చాయి. ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా టిక్‌టాక్‌ను బ్యాన్ చేయాలంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.