50 వేల లోపే ఐఫోన్ 11.. ఇంకో ఆఫర్ కూడా ఉందండోయ్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 10 Oct 2020 12:03 PM GMTయాపిల్ మొబైల్ ఫోన్ లను కొనాలంటే కిడ్నీలను తాకట్టు పెట్టాలని కామెంట్లు చేస్తూ ఉంటారు. 50 వేల రూపాయలలోపు ఐఫోన్ 11ను కొనుక్కోవచ్చు అంటే చాలా మంది నమ్మరేమో..! సెకండ్ హ్యాండ్ మొబైల్ ఫోన్ అయ్యింటుందా అని కూడా అనుమానాలను వ్యక్తం చేస్తారు. కానీ 50వేల రూపాయల లోపు ఐఫోన్ 11ను అమ్మకానికి ఉంచబోతోంది అమెజాన్ సంస్థ.
అక్టోబర్ 17 నుండి మొదలు కాబోతోన్న అమెజాన్ "గ్రేట్ ఇండియన్ సేల్ '' సందర్భంగా యాపిల్ ఐఫోన్ 11 ను 50 వేల రూపాయల కంటే తక్కువకే సేల్ లో పెట్టబోతున్నారు. ప్రస్తుతం భారతదేశంలో ఐఫోన్ 11 ధర 68,300 గా ఉంది.. అతి తక్కువ ధర వద్ద అత్యంత శక్తివంతమైన ఐఫోన్ ఇవ్వబోతున్నామని అమెజాన్ ఇండియా చెబుతోంది. 64 జీబీ ఐఫోన్ 11 వేరియంట్ ధర అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ సందర్భంగా గణనీయంగా తగ్గనుందని భావిస్తూ ఉన్నారు. ఇక క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్‌బ్యాక్ / తక్షణ డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉన్న సంగతి తెలిసిందే.
ఐఫోన్ 11 కొనుగోలు చేసిన వారికి యాపిల్ ఎయిర్‌పాడ్ ఉచితంగా లభించబోతోంది. భారతదేశంలో ఇటీవలే ప్రారంభించిన యాపిల్ ఇండియా ఆన్ లైన్ స్టోర్ ద్వారా ఐఫోన్ 11 కొనుగోలు చేసిన వినియోగదారులకు 15 వేల రూపాయల ఎయిర్‌పాడ్స్‌ను ఉచితంగా అందించనుంది. ఈ ఆఫర్ అక్టోబర్ 17 నుండి ప్రారంభమవుతుంది. 64 జీబీ వేరియంట్ ఐఫోన్ 11 ఆపిల్ ఆన్‌లైన్ స్టోర్‌లో రూ .68,300 ధర వద్ద లభిస్తుంది. ఎయిర్‌పాడ్స్ 14,990 రూపాయలకు విక్రయిస్తోంది.