అక్టోబర్‌ 17నుంచి అమెజాన్‌ 'గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివెల్‌'

By సుభాష్  Published on  6 Oct 2020 10:16 AM GMT
అక్టోబర్‌ 17నుంచి అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివెల్‌

దసరా, దపావళి పండగ సీజన్‌ సందర్భంగా ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌ గ్రేట్‌ ఇండియాన్‌ ఫెస్టివల్‌ పేరుతో భారీ ఆఫర్‌ ప్రకటించింది. అక్టోబర్‌ 17వ తేదీ నుంచి ఈ ప్రత్యేక సెల్‌ ప్రారంభం కానుంది. అయితే ఎప్పటి వరకు ఈ ఆఫర్‌ కొనసాగుతుందనే విషయం వెల్లడించలేదు. గ్రేట్‌ ఇండియా ఫెస్టివల్‌లో భాగంగా అమెజాన్‌లో వస్తువులు కొనుగోలు చేసే వారు హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్‌,క్రెడిట్‌ ఉపయోగించి 10 శాతం డిస్కౌంట్‌ పొందే అవకాశం ఉంది. షరతులకు లోబడి ఈఎంఐలపై కూడా ఇది వర్తిస్తుంది. ప్రైమ్‌ మెంబర్‌షిప్‌ ఉన్న వారు 24 గంటల ముందు నుంచే ఈ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివెల్‌లో వస్తువులు కొనుగోలు చేయవచ్చు.

ఈ సందర్భంగా అక్టోబర్‌ 14న విడుదల చేసే వన్‌ప్లస్‌ 8టీ 5జీ ఫోన్‌, అక్టోబర్‌ 15న తీసుకురానున్న అమెజాన్‌ ఫైర్‌ టీవీ స్టిక్‌ లైట్‌లను ఈ గ్రేట్‌ ఇండియన్‌ సేల్‌లో అమ్మకాలు జరపనుంది. వీటితో పాటు మొబైళ్లు, గృహోపకరణాలు, నిత్యావసరాలు, దుస్తులు, పుస్తకాలు తదితర వస్తువులపై భారీ రాయితీ కల్పించనుంది. మరో వైపు ఫ్లిప్‌కార్ట్‌ కూడా బిగ్‌ బిలియన్‌ డేస్‌ పేరిట అక్టోబర్‌ 16 నుంచి 21 వరకు సేల్‌ నిర్వహిస్తోంది.

Next Story