ఏపీలో ప్రారంభమైన వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక

By సుభాష్  Published on  1 May 2020 4:48 AM GMT
ఏపీలో ప్రారంభమైన వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన పగ్గాలను చేపట్టిన తర్వాత తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ప్రజా సమస్యలే ధ్యేయంగా కొత్త పథకాలను చేపడుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

రాష్ట్రంలో మే 1 నుంచి 'వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక'ను లబ్ధిదారులకు పంపిణీ చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా 58.22 లక్షల మందికి రూ.1421,20 కోట్లు కేటాయించింది. శుక్రవారం ఉదయం నుంచి వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి లబ్దిదారుల చేతికి పెన్షన్‌ డబ్బులను అందిస్తున్నారు. ఈ పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 2,37,615 మంది వాలంటీర్లు పాల్గొని లబ్దిదారులకు పెన్షన్‌ అందజేస్తున్నారు.

అయితే కరోనా నియంత్రణలో భాగంగా బయోమెట్రిక్‌ బదులు పెన్షనర్ల జియో ట్యాగింగ్‌తో కూడిన ఫోటోలను యాప్‌లో అప్‌లోడ్‌ చేస్తూ, ప్రత్యేక యాప్‌ ద్వారా పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు. ఒక వైపు కరోనా నిబంధనలను పాటిస్తూనే మరో వైపు లక్షలాది మంది పెన్షనర్ల చేతికి సొమ్మును అందజేస్తున్నారు. మే నెల వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద రూ. 1421.20 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది.

Next Story