ఏపీకి నిర్మలా సీతారామన్‌.. తెలంగాణకు కిషన్‌రెడ్డి..!

By Newsmeter.Network  Published on  27 March 2020 7:21 AM GMT
ఏపీకి నిర్మలా సీతారామన్‌.. తెలంగాణకు కిషన్‌రెడ్డి..!

కరోనా వైరస్‌ భారత్‌లో చాపకింద నీరులా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతుంది. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌ డౌన్‌ ప్రకటించారు. దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు ఇండ్లకే పరిమితం కావాలని, ఏప్రిల్‌ 14 వరకు స్వీయ నిర్బంధంలో ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని ప్రధాని ఆదేశించారు. దీంతో దేశవ్యాప్తంగానే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలు చేస్తున్నాయి. అయినా తెలంగాణ, ఏపీలో రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగతోంది. తెలంగాణలో ఇప్పటికే 45 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏపీలో 12 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Also Read :చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడా.. ప్రజా వ్యతిరేఖ నాయకుడా?

ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయి పరిస్థితిని సమీక్షించే బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కేంద్ర మంత్రులకు అప్పగించింది. ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అధికారులతో, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణలోని 33 జిల్లాల అధికారులతో ప్రతీనిత్యం టచ్‌లో ఉంటూ కరోనా పరిస్థితి, సహాయక చర్యలపై నేరుగా చర్చించి ఎప్పటికప్పుడు వివరాలు సేకరించనున్నారు. ఈ నివేదికల ఆధారంగా ఎప్పటికప్పుడు తగిన సూచనలు సలహాలు ఇవ్వాలని ఇద్దరు కేంద్ర మంత్రులను ప్రధాని మోదీ ఆదేశించారు.

Also Read :ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్రానికి అభినందనలు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణలో కరోనా పాజిటివ్‌ సంఖ్య 45కు చేరడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతుంది. కాగా వీరిలో ఎక్కువ శాతం విదేశాల నుంచి వచ్చిన వారే ఉండటం కొంత ఆందోళన తగ్గించే విషయం. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే వారి నుంచి ఇతరులకు వైరస్‌ వ్యాపించకుండా ప్రజలను అప్రమత్తం చేసింది. ఆ మేరకు అన్ని చర్యలు చేపడుతుంది. మరోవైపు ఇప్పుడు తెలంగాణ, ఏపీ మధ్య కొత్త సమస్య వచ్చింది. తెలంగాణలో ఉంటున్న ఏపీ ప్రజలు తమ సొంతూళ్లకు వెళ్లేందుకు ప్రయత్నించడంతో సరిహద్దుల వద్ద తీవ్ర ఉద్రిక్తత ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ ఘనటపై కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డి స్పందించారు. ప్రజలు స్వచ్ఛందంగా లాక్‌డౌన్‌ పాటించి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు ఇరు రాష్ట్రాల సీఎంలు మాట్లాడి ఇప్పటికే ఈ వివాదానికి స్వస్తిచెప్పినట్లు కనిపిస్తుంది. ఏపీలోకి రావాలంటే కచ్చితంగా 14రోజులు కార్వంటైన్‌లో ఉండాలని ఏపీ అధికారులు స్పష్టం చేశారు. దీంతో పలువురు కార్వంటైన్‌లోకి వెళ్తుండగా.. మరికొందరు వెనుదిరిగి తెలంగాణకు వెళ్తున్నారు.

Also Read :యువకుడిని చితకబాదిన ఎస్‌ఐ.. సస్పెండ్‌ చేసిన డీజీపీ

Next Story