క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఏపీ మ‌రో రికార్డ్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Jun 2020 8:25 AM GMT
క‌రోనా ప‌రీక్ష‌ల్లో ఏపీ మ‌రో రికార్డ్‌

కరోనా పరీక్షల్లో ఇత‌ర రాష్ట్రాల‌తో పోల్చితే.. ఏపీ దేశంలోనే ముందున్న విష‌యం తెలిసిందే. తాజాగా ఈ విష‌య‌మై ఏపీ మరో మైలురాయిని దాటింది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9 గంటల వరకు 13,923 శాంపిల్స్ పరీక్షించడంతో ఏపీలో ఇప్ప‌టివ‌రకూ మొత్తం జ‌రిపిన క‌రోనా పరీక్షల సంఖ్య 6,12,397కు చేరింది.

దీంతో ప్రతి పది లక్షల మందికి సగటున 11,468 పరీక్షలు నిర్వహించడం ద్వారా ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఇదిలావుంటే.. ఏపీలో మరణాల రేటు కూడా తగ్గింది. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.33 శాతంగా ఉంటే, ఏపీలో మాత్రం 1.23 శాతంగా ఉంది. కృష్ణా జిల్లాలో గురువారం కరోనాతో ఇద్దరు మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 92కి చేరింది.

ఇక‌ కొత్తగా 425 మందికి కరోనా పాజిటివ్ అని తేలడంతో.. ఏపీలో మొత్తం క‌రోనా‌ కేసుల సంఖ్య 7,496కు చేరింది. ఇందులో 5,854 కేసులు ఏపీలో న‌మోద‌యిన‌వి కాగా.. 1,353 కేసులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వ‌ల‌స కార్మికులు, 289 కేసులు విదేశాల నుంచి వచ్చినవారివి ఉన్నాయి. అలాగే.. ప్రస్తుతం 3,632 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Next Story