ఏపీలో మద్యం తయారీకి అనుమతి
By తోట వంశీ కుమార్ Published on 2 May 2020 9:08 PM ISTమందుబాబులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా గ్రీన్ జోన్లలో మద్యం అమ్మకాలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో మద్యం తయారీకి అనుమతులు ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రేపటి నుంచి 20 డిస్టిలరీలు తెరుచుకోనున్నాయి. అయితే.. తాము విడుదల చేసిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది
మొదటగా.. మద్యం తయారీ కంపెనీలను పూర్తిగా శానిజైట్ చేయాలని, మద్యం తయారీ సమయాల్లో కార్మికులు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలని సూచించింది. మద్యం తయారీ కంపెనీల్లో గుట్కా, సిగరెట్‌ను పూర్తిగా నిషేదించింది. ఇక కంపెనీలో ఎంట్రీ, ఎగ్జిగ్ గేట్లు వేర్వేరుగా ఉండాలని తెలిపింది. కార్మికులు లిప్టులు ఉపయోగించరాదని మార్గదర్శకాల్లో తెలిపింది.
Next Story