ఆ వాలంటీర్ కుటుంబానికి రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 May 2020 9:51 AM GMT
ఆ వాలంటీర్ కుటుంబానికి రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం

గుండెపొటుతో మ‌ర‌ణించిన గ్రామ వాలంటీర్ కుటుంబానికి రూ.5ల‌క్ష‌ల ప‌రిహారం ఇస్తామ‌ని సీఎం జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. విశాఖ ఏజెన్సీ పాడేరు మండ‌లం తుంపాడ గ్రామ స‌చివాల‌యం కుజ్జెలి పంచాయ‌తీలో వాలంటీర్ అనురాధ(26) ఫెన్ష‌న్లు పంపిణీ చేస్తూ గుండెపోటుతో మృతి చెందింది. ఈ వార్త‌ను దిన‌ప‌త్రిక‌ల్లో చూసిన సీఎం.. అనురాధ కుటుంబానికి శ‌నివారం రూ.5ల‌క్ష‌ల ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు.

సీఎంఓ అధికారుల‌తో మాట్లాడి ఘ‌ట‌న వివ‌రాలు తెలుసుకున్నారు. విప‌త్తు స‌మ‌యంలో ప‌నిచేస్తున్న వాలంటీర్ల‌కు ఇలాంటి ప‌రిస్థితులు ఎదురైన్ప‌పుడు ఆదుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. గబ్బాడ అనూరాధ కుటుంబానికి రూ.5 లక్షల పరిహారాన్ని ప్రకటించారు. అనూరాధ కుటుంబానికి ఈ సహాయం వెంటనే అందేలా చూడాలని విశాఖ జిల్లాకలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.

Next Story