ముఖ్యాంశాలు

  • సీఎం జగన్‌ ఇంటి పనుల నిమిత్తం నిధుల కేటాయింపు
  • సీఎం నివాసానికి సర్కార్‌ నిధులేంటంటూ విమర్శలు
  • విమర్శల నేపథ్యంలో కేటాయింపులు రద్దు

అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌ ఇంటి వద్ద సౌకర్యాల కల్పన నిమిత్తం కేటాయింపులు జరుపుతూ ఇచ్చిన జీవోలను ప్రభుత్వం రద్దు చేసింది. తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసం, హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో ఇళ్లలో ఫర్నీచర్‌ కొనుగోలు, విద్యుత్‌ అవసరాలు, ఇతర పనుల కోసం వివిధ సందర్భాల్లో ఏపీ ప్రభుత్వం ఐదు జీవోలు జారీ చేసింది. సుమారు రూ.3.10 కోట్లను పనుల నిమిత్తం ప్రభుత్వం కేటాయించింది. దీంతో హైదరాబాద్‌, తాడేపల్లిలోని సీఎం జగన్‌ నివాసాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయింపు చేశారని తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. సీఎం అధికారిక నివాసానికి ప్రభుత్వమే నిధులు భరించాలి. కాగా సీఎం జగన్‌ తన ఇంటికి కేటాయించిన నిధులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. సీఎం ఇంటికి నిధుల కేటాయింపుపై ప్రతిపక్షాలు మండిపడ్డాయి. సీఎం సర్కార్‌కు నిధులేంటంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. విమర్శల నేపథ్యంలో కేటాయింపు జీవోలను రద్దు చేశారు. విమర్శలు తారా స్థాయికి చేరడంతో సీఎం జగన్‌ కేటాయింపు నిధుల జీవోలను రద్దు చేశారు.

అంజి గోనె

నా పేరు గోనె. అంజి. న్యూస్‌మీటర్‌ తెలుగులో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో 99టీవీలో క్షేత్రస్థాయి అధ్యయనం చేశాను. మోజో టీవీలో సంవత్సరం పాటు జర్నలిస్టుగా పనిచేశాను. కలం నా బలం, సమస్యలే నా గళం. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.