ఏపీ‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్‌) నిర్వహణకు తేదీలు ఖరారయ్యాయి. ఈ మేర‌కు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రవేశ పరీక్షల తేదీల షెడ్యూల్‌ను‌ శుక్రవారం ప్రకటించారు. కరోనా వైరస్‌తో లాక్‌డౌన్‌ కారణంగా ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే.

తాజాగా.. సెప్టెంబర్‌ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్‌ ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇ‍క సెప్టెంబర్‌ 10,11 తేదీల్లో ఐసెట్‌, 14న ఈసెట్‌, 28, 29, 30 తేదీల్లో ఏపీ పీఈసెట్‌, అక్టోబర్‌ 1న ఎడ్‌సెట్‌, 2వ తేదీన లాసెట్‌ నిర్వహించనుంది. ఇదిలావుంటే.. తెలంగాణలో కూడా కొద్ది రోజుల క్రిత‌మే ప్ర‌వేశ ప‌రీఓల తేదీల‌ను ప్ర‌క‌టించారు. ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో‌ ఎంసెట్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Ap

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.