జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

By సుభాష్  Published on  17 Aug 2020 10:29 AM GMT
జగన్‌ సర్కార్‌ కీలక నిర్ణయం

ఏపీ ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టినా నాటి నుంచి అన్ని కీలక నిర్ణయాలే తీసుకుంటున్నారు. తనదైన శైలిలో పాలన కొనసాగిస్తూ ముందుకు కదులుతున్నారు. గ్రామ సచివాలయాల్లో అందించే సేవలకు సంబంధించి డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్రంలో 15వేలకుపైగా ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల్లో యూపీఐ ఆధారిత చెల్లింపులు అందుబాటులోకి తీసుకురానుంది. డిజిటల్‌ ఏపీ పేరిట తీసుకువస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా 35 శాఖలకు సంబంధించిన 500కిపైగా సేవలకు యూపీఐ ద్వారా చెల్లింపులు జరపవచ్చు. ఇందు కోసం ఏపీ ప్రభుత్వం ఎన్వీసీఐ, కెనరా బ్యాంకులతో చేయి కలిపింది.

అంతేకాకుండా గిరిజన కో ఆపరేటివ్‌ కార్పొరేషన్లను రైతు భరోసా కేంద్రాలకు అనుసంధానిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నుంచి గిరిజన ఉత్పత్తుల కొనుగోళ్లు భరోసా కేంద్రాల ద్వారానే జరుగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. గిరిజన ప్రాంతాల్లోని సహజ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ మరింతగా కల్పించాలనే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూరం మాలకొండయ్య కీలక సూచనలు చేశారు. ఈ ప్రక్రియ ద్వారా కొనుగోళ్లు, మార్కెటింగ్‌ వంటి ప్రక్రియలు సమన్వయంతో సాగుతాయని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది.

Next Story