ఏపీ సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2020 12:15 PM GMT
ఏపీ సీఎస్‌ పదవీకాలం పొడిగింపు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్‌) నీలం సాహ్ని పదవీ కాలన్ని కేంద్ర ప్రభుత్వం పొడిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆమె పదవీకాలం ముగియనుండగా.. పదవీకాలాన్నీ మరో 6 నెలలు పొడిగించాలని సీఎం జగన్‌ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. సీఎస్‌ నీలం సాహ్ని పదవీకాలాన్ని మరో 3 నెలలు (జూలై 1వ తేదీ నుంచి సెప్టెంబర్‌ 30వరకు) పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అంతకుముందు ఏపీ సీఎస్‌గా పనిచేస్తున్న ఎల్వీ సుబ్రహ్మణ్యంను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో నీరబ్ కుమార్‌ ప్రసాద్ తాత్కాలికంగా భాద్యతలు అప్పగించారు. ఆ తర్వాత సాహ్ని ఏపీ సీఎస్‌గా పూర్తిస్థాయిలో భాద్యతలు చేపట్టారు. 1984వ ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన నీలం సాహ్ని నవ్యాంధ్రప్రదేశ్‌కు తొలి మహిళా సీఎస్‌.

AP CS gets three months extension

Next Story