సుప్రీం కోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి షాక్..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  3 Jun 2020 7:40 AM GMT
సుప్రీం కోర్టులోనూ ఏపీ ప్రభుత్వానికి షాక్..

ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వ కార్యాలయాలకు వేసిన రంగులు తొలగించాలని హైకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీనిని సవాల్‌ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారించిన న్యాయస్థానం రంగులను తొలగించాలని ఆదేశించింది. ఇందుకు నాలుగు వారాల సమయం ఇచ్చింది. లేని పక్షంలో కోర్టు ధిక్కారణ కింద చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో మరో సారి కోర్టుల్లో ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగినట్లు అయ్యింది. హైకోర్టు ఇచ్చిన తీర్పు చాలా స్పష్టంగా ఉందన్న సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.

ఇదిలా ఉంటే.. ఏపీ ప్రభుత్వం మరో కీలక కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని భూముల రీసర్వేకు ఉత్తర్వులు జారీ చేసింది. కంటిన్యూయస్ ఆపరేటింగ్ రెఫరెన్స్ స్టేషన్ ద్వారా రీసర్వేకు ఆదేశాలు జారీ అయ్యాయి. రీసర్వే కోసం 65 బేస్ స్టేషన్లు, కంట్రోల్ సెంటర్ల ఏర్పాటుకు అనుమతులు ఇస్తూ ఈరోజు ఉత్తర్వులను జారీ చేసింది. రీసర్వే చేయడానికి రూ. 200 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Next Story