కరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు
By సుభాష్ Published on 3 Jun 2020 5:56 AM GMTకరోనా పరీక్షల్లో ఏపీ మరో రికార్డు సాధించింది. కరోనా పరీక్షల నిర్వహణలో భాగగా రోజుకు 12వేల మందికి పైగా పరీక్షలు చేస్తూ దేశంలోనే తొలి స్థానంలో నిలిచింది. పరీక్షల నిర్వహణలోనే కాకుండా జిల్లాల వారీగా మెరుగైన ఆరోగ్య సేవలు అందిస్తున్నట్లు ఏపీ కరోనా నోడల్ అధికారి తెలిపారు. కాగా, ఇప్పటి వరకూ 3200 మందికి కరోనా పాజిటివ్ రాగా, వారికి మెరుగైన చికిత్స అందించడంతో2209 మంది కోలుకుని డిశ్చార్జ్ చేశామని అన్నారు. ఇక కరోనా కేసుల్లో దేశ రికవరీ రేటు 48 శాతం, ప్రపంచంలో 45శాతం ఉండగా, ఏపీలో మాత్రం 69 శాతంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి,పారిశుధ్య సిబ్బందికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
కాగా, ఏపీలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ఉండటంతో ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇప్పటికే కేసుల సంఖ్య తీవ్ర స్థాయిలో పెరుగుతుండటంతో దానిని కట్టడి చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేపడుతోంది. పాజిటివ్ ఉన్నవారిని త్వరగా గుర్తించేందుకు పరీక్షలు చేయడం ముమ్మరం చేసింది. అధిక మొత్తంలో కరోనా కిట్లను తీసుకొచ్చి పరీక్షల సంఖ్యను పెంచింది. ఇప్పటికే కరోనా పరీక్షల్లో రికార్డు సాధించిన ఏపీ మరోమారు ఎక్కువ పరీక్షలు చేసి మరో రికార్డు సాధించింది.