ఏపీలో 200దాటిన మృతుల సంఖ్య
By తోట వంశీ కుమార్ Published on 3 July 2020 12:57 PM ISTఆంధ్రపద్రేశ్‌లో కరోనా మహమ్మారి కరాళనృత్యం చేస్తోంది. ప్రతి నిత్యం 800 పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 38,898 సాంపిల్స్‌ని పరీక్షించగా.. కొత్తగా 837 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో తెలిపింది. వీటిలో రాష్ట్రానికి చెందిన వారు 789 మంది కాగా.. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో 46 మంది.. 2ఇద్దరు విదేశాల నుంచి వచ్చినవారు ఉన్నారు. వీటితో కలిపి ఇప్పటి వరకు రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 16934కి చేరింది.
ఈ రోజు కొవిడ్ వల్ల కర్నూలులో నలుగురు, చిత్తూరులో ఇద్దరు, కృష్ణలో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు మృత్యువాతపడ్డారు. దీంతో రాష్ట్రంలో మృతుల సంఖ్య 206కి చేరింది. మొత్తం నమోదు అయిన కేసుల్లో ఇప్పటి వరకు 7632 మంది కోలుకుని డిశ్చార్జి కాగా.. 9096మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా నమోదు అయిన కేసుల్లో అనంతపురంలో 149, చిత్తూరులో 47, ఈస్ట్ గోదావరిలో 56, గుంటూరులో 80, కడపలో 19, కృష్ణలో 17, కర్నూలులో 116, నెల్లూరులో 15, ప్రకాశంలో 139, శ్రీకాకుళం 30, విశాఖపట్నంలో 54, విజయనగరంలో 10, పశ్చిమ గోదావరిలో 57 చొప్పున కేసులు నమోదు అయ్యాయి.