సుశాంత్ ఓ సమస్యాత్మక వ్యక్తి : అనురాగ్ కశ్యప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  10 Sept 2020 1:18 PM IST
సుశాంత్ ఓ సమస్యాత్మక వ్యక్తి : అనురాగ్ కశ్యప్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

ఆత్మ‌హ‌త్య చేసుకున్న బాలీవుడ్ యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌పై దర్శకుడు అనురాగ్ కశ్యప్ ట్విట‌ర్ వేధిక‌గా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ను బాలీవుడ్ అంతా కావాలనే పక్కన పెట్టిందంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు అనురాగ్ స్పందించారు. సుశాంత్ ఓ సమస్యాత్మక వ్యక్తి అని, అందుకే అతనితో పనిచేయలేదని అనురాగ్ కశ్యప్ బ‌దులిచ్చారు.



సుశాంత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కొన్ని వారాల ముందు అతని మేనేజర్‌తో చేసిన వాట్సాప్ చాట్ యొక్క‌ స్క్రీన్ షాట్‌లను షేర్ చేశారు.

చాట్ ప్ర‌కారం.. మీ సినిమాలో ఏదైనా పాత్రకు సుశాంత్ సరిపోతాడనుకుంటే.. అతణ్ని దృష్టిలో పెట్టుకోండని అనురాగ్‌ను మేనేజర్ అడిగాడు. దానికి స్పందించిన అనురాగ్.. 'కెరీర్ ప్రారంభం నుంచే సుశాంత్ నాకు తెలుసు. అతను ఓ సమస్యాత్మక వ్యక్తి' అని రిప్లై ఇచ్చారు.

అలాగే.. ఇప్పుడు ఈ చాట్‌ బయటపెడుతున్నందుకు నన్ను క్షమించండి. ఇది సుశాంత్ చనిపోవడానికి మూడు వారాల ముందు జ‌రిగింది. సుశాంత్‌తో పనిచేయకపోవడానికి నా కారణాలు నాకున్నాయని అనురాగ్ పేర్కొన్నారు.

Next Story