తల్లికాబోతున్న ఉదయ్‌కిరణ్ హీరోయిన్
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 11 Oct 2020 1:27 PM ISTనటి అనిత అంటే వెంటనే గుర్తుకురాకపోవచ్చు కానీ.. ఉదయ్‌కిరణ్ హీరోగా నటించిన 'నువ్వు నేను' చిత్రంలోని హీరోయిన్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. తాజాగా ఈ నటి శుభవార్త చెప్పారు. తాను తల్లి కాబోతున్నట్లు తెలిపారు. 2013లో పారిశ్రామిక వేత్త రోహిత్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత సినిమాలకు దూరంగా ఉన్నా అనిత.. ఉత్తరాదిన బుల్లితెరపై మాత్రం సందడి చేస్తోంది.
త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తన భర్తతో కలిసి ఒక స్పెషల్ వీడియోను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. రోహిత్-అనిత పరిచయం.. ప్రపోజ్ చేయడం.. పెళ్లి ఇలా ప్రతి విషయాన్ని ఈ వీడియోలో ఆకట్టుకునే విధంగా చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అనిత కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, హిందీ, మళయాళం, పంజాబీ బాషల్లో కూడా నటించింది. ముఖ్యంగా ఆమె హిందీ సీరియల్స్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అలాగే పలు రియాలిటీ షోల ద్వారా కూడా అనిత మంచి క్రేజ్ సంపాదించుకుంది.
View this post on Instagram
❤️+❤️=❤️❤️❤️ Love you @rohitreddygoa #gettingreadyforreddy
A post shared by Anita H Reddy (@anitahassanandani) on