ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..!

By అంజి  Published on  2 Dec 2019 8:01 AM GMT
ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నం..!

కృష్ణా జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు కుమారులకు విషమచ్చి తానూ కూడా తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన గన్నవరం మండలం ముస్తాబాద్‌లో తీవ్ర కలకలం రేపింది. అంకమ్మ అనే మహిళ తన ఇద్దరు కుమారులకు విషమిచ్చి తాను తాగింది. ఈ ఘటనను గమనించిన స్థానికులు వెంటనే ఆ తల్లి, కుమారులను ఆస్పత్రికి తరలించారు. చిన్న కుమారుడు మృతి చెందగా, పెద్ద కుమారుడు, తల్లి పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబ కలహాలే ఆత్మహత్యయత్నానికి కారణంగా స్థానికులు భావిస్తున్నారు. కాగా ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it