న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం.. సముద్రంలో మునిగి ముగ్గురు మృతి

By అంజి  Published on  1 Jan 2020 7:16 AM GMT
న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం.. సముద్రంలో మునిగి ముగ్గురు మృతి

ముఖ్యాంశాలు

  • వాకాడు మండలం తూపిలిపాలెంలో విషాదం
  • సముద్ర స్నానాలు చేస్తూ ముగ్గురు మృతి
  • మృతుల్లో ఇద్దరు యువతులు
  • మృతులు చిత్తూరు జిల్లా జీవకోన వాసులుగా గుర్తింపు

నెల్లూరు: న్యూ ఇయర్‌ వేడుకల్లో విషాదం జరిగింది. సముద్రం ఒడ్డున న్యూ ఇయర్‌ జరుపుకుంటున్న వారిని మృత్యువు కబళించింది. నెల్లూరు జిల్లాలో సముద్ర స్నానాలు చేస్తూ ముగ్గురు యువకకులు మృతి చెందారు. వాకాడు మండలం తూపిలిపాలెంలో మంగళవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. సముద్రం దగ్గర న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకున్న ముగ్గురు స్నానానికి వెళ్లి మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువతులు కూడా ఉన్నారు. మృతులది చిత్తూరు జిల్లా జీవకోన వాసులుగా స్థానికులు గుర్తించారు.

విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. న్యూ ఇయర్‌ వేడుకల రోజున ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. న్యూఇయర్‌ వేడుకల రోజున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మొదటి నుంచి పోలీసులు చెబుతునే ఉన్నారు. అయినా ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story
Share it