అట్టహాసంగా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌..!

By అంజి
Published on : 1 Jan 2020 8:28 AM IST

అట్టహాసంగా న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌..!

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్‌ సెలబ్రేషన్స్‌ అట్టహాసంగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌, వరంగల్‌, విజయవాడ, తిరుపతి, విశాఖలో కలర్‌ఫుల్‌గా వేడుకలు అదరగొడుతున్నాయి. అర్థరాత్రి 12 గంటల తర్వాత నూతన సంవత్సరానికి తెలుగు ప్రజలు గ్రాండ్‌గా వెల్‌కమ్‌ చెప్పారు. ప్రతి ఒక్కరు పార్టీ జోష్‌లో మునిగిపోయారు. యూత్‌ ఆటపాటలతో ఎంజాయ్‌ చేశారు. ప్రధాన పట్టణాల్లో న్యూ ఇయర్‌ ఈవెంట్స్‌ గ్రాండ్‌గా జరిగాయి. మిరుమిట్లు గొలిపే కాంతులు.. ఆకాశంలో తారాజువ్వలు పేలుతుండగా ప్రతి ఒక్కరు కొత్త సంవత్సర సంబరాల్లో మునిగిపోయారు.

2019కి బైబై.. 2020కి గ్రాండ్‌ వెల్‌కమ్‌ అంటూ అందరూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. విశాఖ ఆర్కేబీచ్‌లో న్యూ ఇయర్‌ వేడుకల్లో సీపీ మీనా పాల్గొన్నారు. హైదరాబాద్‌ నగరంలోని తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ వద్ద న్యూ ఇయర్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ కేక్‌ కట్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అల్కాపూరి చౌరస్తాలో రాచకొండ సీపీ మహేష్‌ భగవత్‌ కేక్‌ కట్‌ చేసి న్యూఇయర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Next Story