ద‌టీజ్ త్రివిక్ర‌మ్‌.. ఆ స్పీచ్‌కు కేసీఆర్ ఫిదా..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  31 Dec 2019 1:55 PM GMT
ద‌టీజ్ త్రివిక్ర‌మ్‌.. ఆ స్పీచ్‌కు కేసీఆర్ ఫిదా..!

త్రివిక్ర‌మ్ శ్రీనివాస్‌.. ఈ పేరు పంచ్‌కు ప‌ర్మినెంట్ అడ్ర‌స్. ప్రాస‌కు రెసిడిన్సియ‌ల్ అడ్ర‌స్‌. అవును.. అద్భుత‌మైన‌ మాట‌ల‌తో తెలుగు బాషకు ఉన్న‌ అందాన్ని మ‌రింత పెంచిన ర‌చ‌యిత త‌ను. పుస్త‌కానికి ముందుమాట త‌ను. చిరున‌వ్వుకు చిరునామా త‌ను. బావోద్వేగాలు పండించ‌డంలో పెద్ద‌న్న త‌ను. మ‌నిషే గ్రంథాల‌యం అయితే ఆ వ్య‌క్తే త‌ను. ఒక ర‌చ‌యిత, ద‌ర్శ‌కుడిని ఇంత‌లా పొగ‌డడానికి కార‌ణం త‌న మాట‌ల‌తో, సినిమాల‌తో అంత‌లా తెలుగు ప్ర‌జ‌ల గుండెల్లో నిలిచారు. త‌ను కేవ‌లం 'త్రి'విక్ర‌మ్ కాదు అనంత‌మైన విక్ర‌ముడు. అటువంటి త్రివిక్ర‌మ్ అప్పుడ‌ప్పుడు త‌న ప్ర‌సంగాల‌తో కూడా యూత్‌లో ఒక ప్ర‌త్యేక‌మైన‌ స్థానం సంపాదించుకున్నారు.

అయితే.. తాజాగా త్రివిక్ర‌మ్ టీవీ9 న‌వ న‌క్ష‌త్ర అవార్డ్ పంక్ష‌న్‌కు అతిధిగా వ‌చ్చారు. ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, మెగాస్టార్ చిరంజీవి, నాగార్జున‌, మై హోం గ్రూప్స్ అధినేత జూప‌ల్లి రామేశ్వ‌రావు త‌దిత‌రులు కూడా ముఖ్య అతిధులుగా హాజ‌ర‌య్యారు. ఈ పంక్ష‌న్‌లో అతిథుల‌ను, అవార్డ్‌లు పొందిన అంద‌రిని ఆక‌ట్టుకుంది మాట‌ల మాంత్రికుడు త్రిక్ర‌మ్ స్పీచ్.

ఈ అవార్డుల పంక్ష‌న్‌కు ముఖ్య అతిథిగా హాజ‌ర‌యిన కేసీఆర్‌ను ఉద్దేశించి త్రివిక్ర‌మ్ మాట్లాడుతూ.. అంద‌రూ హిస్ట‌రీ క్రియేట్ చేస్తారు.. మీరు జాగ్ర‌ఫీ క్రియేట్ చేశారు స‌ర్.. తెలంగాణ అనే స్టేట్ ద్వారా..! ఇంత‌కు మిమ్మ‌ల్ని టీవీల్లో చాలాసార్లు చూసాను. ప్ర‌త్య‌క్షంగా చూడ‌టం ఇదే మొద‌టిసారి త‌న‌దైన శైలిలో మాట్ల‌డుతుంటే కేసీఆర్ కూడా శ్ర‌ద్ధ‌గా విన్నారు.

అంతేకాకుండా.. నిజంగా గొప్పోళ్ల‌ను చూస్తుంటే.. ధైర్యానికి, సాహ‌సానికి ఒక‌టే తేడా క‌నిపించింది. ధైర్యం అంటే ఆ క్ష‌ణంలో తెగించి చేసేయ‌డం.. ఒక ప్ర‌మాదం జ‌రుగుతున్న‌పుడు.. ఒక యాక్సిడెంట్ జ‌రుగుతున్న‌ప్పుడు తెగించి కాపాడ‌టం.. వీరంతా ధైర్య‌వంతులు కాదు.. సాహ‌స‌వంతులు..! సాహ‌స‌మంటే.. ఆ క‌ష్టం ఏమిటో తెలిసి.. దాని లోతు ఎంతో తెలిసి.. ఆ ప‌ని జ‌ర‌గ‌పోవ‌చ్చనేట‌టువంటి అప‌న‌మ్మ‌కం కూడా ఉండి.. చాలామంది మ‌న‌ల్ని వెన‌క్కి లాగుతున్నా కూడా.. ధైర్యంగా ముందుకు వెళ్లేవాళ్లు. చివ‌ర‌గా ఈ స‌న్మానం నాకు ఎందుకు బాగా న‌చ్చిందంటే.. 15 సంవ‌త్స‌రాల సుధీర్ఘ‌మైన పోరాటాన్ని న‌డిపిన ఓ సాహ‌స‌వంత‌మైన వ్య‌క్తి(కేసీఆర్) ముందు.. ఇలాంటి సాహ‌స‌వంతుల గురించి ఒక టీవీ చెప్ప‌డ‌మ‌నేది నాకు బాగా న‌చ్చిందంటూ ముగించారు. అంతే ఒక్క‌సారిగా ఆడిటోరియం అంతా చ‌ప్ప‌ట్ల‌తో మారుమ్రోగిపోయింది. త్రివిక్ర‌మ్ మాట‌ల‌కు.. కేసీఆర్ కూడా న‌వ్వులు చిందించారు. ద‌టీజ్ త్రివిక్ర‌మ్..!

Next Story
Share it