ఎస్ఈసీ ప్రవర్తన టీడీపీకి లబ్దిచేకూర్చేలా ఉంది : వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy Fires On SEC. ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా..

By Medi Samrat  Published on  6 Feb 2021 4:54 PM IST
ఎస్ఈసీ ప్రవర్తన టీడీపీకి లబ్దిచేకూర్చేలా ఉంది : వైవీ సుబ్బారెడ్డి

ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ చెప్పిన మాటలు పట్టించుకోకుండా.. ఎన్నికల నియమావళి ప్రకారం అధికారులు ప్రవర్తించాలని రాయలసీమ వైసిపి ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో తిరుపతి, చిత్తూరు, రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ సీనియర్ నాయకులతో తిరుపతిలో సమావేశాన్ని నిర్వహించారు.

రాయలసీమ ఇన్ ఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు నారాయణ స్వామి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గౌతంరెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జలరామకృష్ణారెడ్డి, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ ఆర్కే రోజా, జిల్లాలోని పార్టీ శాసనసభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన తీరు, ఎస్ఈసీ వ్యవహారం తదితర అంశాలపై చర్చించారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన సుబ్బారెడ్డి.. టిడిపికి లబ్దిచేకూర్చేలా ఎస్ఈసీ ప్రవర్తన ఉందన్నారు. అధికారులు నియమనిబంధనల ప్రకారం నడచుకోవాలని అన్నారు.


Next Story