నేను ఎక్కడ ఉంటే అక్కడే విధేయుడిగా ఉంటా: వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
YSRCP Rebel MLA Kotamreddy Sridharreddy. వైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడు పెంచారు. తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులపై
By Medi Samrat Published on 4 Feb 2023 6:54 PM ISTవైసీపీ రెబెల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దూకుడు పెంచారు. తనపై ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతూ ఉన్నారు. నెల్లూరు 22వ డివిజన్ కార్పొరేటర్ భాస్కరెడ్డిని కిడ్నాప్ చేశారంటూ కోటంరెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయడంపై కోటంరెడ్డి స్పందించారు. రెండు రోజుల క్రితం తన వెంటే ఉంటానని చెప్పాడని, నిన్న కారు దగ్గరకు వచ్చి, బాధగా ఉందని హత్తుకుని ఏడ్చాడని అన్నారు. గంట తర్వాత కిడ్నాప్ కేసులు పెట్టారని విమర్శించారు. మంత్రి కాకాణి గురించి మాట్లాడుతూ వైఎస్ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కూడా నీకు లేదని అన్నారు. వైసీపీలో ఉండకూడదు అని నిర్ణయించుకున్న తర్వాతే తాను టీడీపీ వైపు మళ్లానని.. తాను వైసీపీకి విధేయుడిని కాదు, వేరే వాళ్లకు విధేయుడినని కాకాణి అన్నారని, అవును, తాను ఎక్కడ ఉంటే అక్కడ విధేయుడిగా ఉంటానని, పక్కదారులు చూడనని అన్నారు. పొదలకూరులో వైఎస్ విగ్రహం పెట్టకుండా గతంలో మీరు అడ్డుకోలేదా? అని ప్రశ్నించారు. తనను తిడితే వైసీపీలో పదవులు వస్తాయనుకొని విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీలో ఉండి చంద్రబాబు కాళ్లకు దండం పెట్టింది కాకాణి కాదా? అని ప్రశ్నించారు. నెల్లురు కోర్టులో దస్త్రాల చోరీ కేసులో అన్ని వేళ్లు నీవైపే చూపిస్తున్నాయని ముందు ఆ కేసు సంగతి చూసుకో అన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి. బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి తనను బెదిరించాడని, కొట్టుకుంటూ తీసుకెళ్తానన్నాడని అన్నాడని. ఆ వ్యక్తి సజ్జల కోటరీకి చెందిన వ్యక్తి అని తేలిందని చెప్పారు. సజ్జలా... నాకు ఇలాంటి కాల్స్ చేయిస్తే, నీకు నెల్లూరు రూరల్ నుంచి నేరుగా వీడియో కాల్స్ వస్తాయని హెచ్చరించారు. సజ్జల, బోరుబడ్డ అనిల్ లాంటి వ్యక్తులకు బెదిరే రకం తాను కాదని చెప్పారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని కడప జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఫోన్ చేసి బెదిరించిన ఆడియో వైరల్ అవుతోంది. కడప నుంచి నెల్లూరు ఎంతో దూరంలో లేదు. ఐదు నిమిషాల్లో వచ్చి లాక్కెళ్తా అని కోటంరెడ్డిని బోరుగడ్డ అనిల్ హెచ్చరించిన సంగతి తెలిసిందే..!