నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం : విజయసాయి రెడ్డి
కాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు.
By Medi Samrat Published on 6 Jan 2025 7:17 PM ISTకాకినాడ సీ పోర్ట్ విషయంలో ఈడీ విచారించిందని వైసీపీ నేత విజయసాయి రెడ్డి తెలిపారు. ఈడీ విచారణ ముగిసిందని.. 25 ప్రశ్నలు అడిగారని తెలిపారు. KV రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ దర్యాప్తు చేసిందని.. KV రావు నాకు తెలియదు అని చెప్పానని.. అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించినట్లు పేర్కొన్నారు. కాకినాడ C పోర్ట్ విషయంలో KV రావుకు ఎక్కడ నేను ఫోన్ చెయ్యలేదని.. KV రావును తిరుమలకు రమ్మని చెప్పమని చెప్పండి అని చెప్పాను.. నేను తప్పు చేస్తే ఏ శిక్షకైనా సిద్ధం.. మే నెల 2020లో నేను ఫోన్ చేసానని KV రావు చెపుతున్నాడు.. కాల్ డేటా తీసి చూడండి.. నేను ఎక్కడ కూడా KV రావుకు ఫోన్ చెయ్యలేదు.. KV రావును ఈడీ విచారణకు పిలవండి అని కోరానని వెల్లడించారు.
రంగనాధ్ కంపెనీని ప్రభుత్వంకు ఎవ్వరు పరిచయం చేసారని ఈడీ ప్రశ్నించింది.. నాకు సంబంధం లేదు అని చెప్పాను.. నేను ఒక సాధారణ మైన ఎంపీని మాత్రమే.. శ్రీధర్ అండ్ సంతాన్ కంపెనీని కూడా ఎవ్వరు ఆపాయింట్ చేసారో నాకు తెలియదు అని చెప్పానన్నారు. శరత్ చంద్రా రెడ్డితో ఉన్న సంబంధాలు కూడా అడిగారు.. కుటుంబ రీలేషన్ అని చెప్పానని తెలిపారు.. కాకినాడ C పోర్ట్ విషయంలో నాకు లుక్ ఔట్ నోటీసులు ఇచ్చారు.. లుక్ ఔట్ నోటీసులపై నేను ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళానని పేర్కొన్నారు. KV రావు ఇచ్చిన ఫిర్యాదు తప్పుడు కేసు అయితే నేను సివిల్ అండ్ క్రిమినల్ సూట్ వేస్తానని ఈడీకి చెప్పినట్లు తెలిపారు. విక్రాంత్ రెడ్డి తెలుసా అని అడిగారు.. విక్రాంత్ రెడ్డితో ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరుపలేదని.. 22 సంవత్సరాల క్రితం జరిగిన ఆర్థిక లావాదేవీలు గురించి అడిగారని వెల్లడించారు.
ఇదిలావుంటే.. కాకినాడ సీ పోర్టు, సెజ్ కు సంబంధించి అక్రమంగా షేర్లను బదలాయించుకున్నట్టు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై కర్నాటి వెంకటేశ్వరరావు (కేవీ రావు) అనే వ్యక్తి ఫిర్యాదుతో సీఐడీ కేసు నమోదు చేసింది. సీఐడీ కేసు ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలో నేడు విజయసాయిరెడ్డి హైదరాబాదులో ఈడీ విచారణకు హాజరయ్యారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.