టీడీపీ.. I.N.D.I.A. కూటమి పక్షే

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం

By Medi Samrat  Published on  16 Sep 2023 9:49 AM GMT
టీడీపీ.. I.N.D.I.A. కూటమి పక్షే

టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్టయి, ప్రస్తుతం రాజమండ్రి కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ పలువురు నేతలు స్పందిస్తూ ఉన్నారు. దీనిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు.

చంద్రబాబుకు మద్దతిస్తూ నారా లోకేశ్ కు ఫోన్ కాల్స్ చేస్తోంది కేవలం ఇండియా కూటమిలో ఉన్న పార్టీలకు చెందినవారేనని అన్నారు. ఈ కాల్స్ ను చూసి.. ఇండియా కూటమిలో టీడీపీ కూడా ఉందని నిరూపితమవుతోందని తెలిపారు. వీళ్లందరి ఉమ్మడి ప్రణాళిక ఒక్కటేనని, అధికారం కోసం చేతులు కలపడం, అందినకాడికి రాష్ట్రాన్ని దోచేయడమేనని విజయసాయి విమర్శించారు. ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ము టీడీపీకి లేదని అన్నారు విజయసాయి రెడ్డి.

ఇక ఐటీ ఉద్యోగుల ర్యాలీ.. అంటూ పలు నగరాల్లో సాగుతున్న ర్యాలీలపై కూడా విమర్శలు గుప్పించారు విజయసాయి రెడ్డి. "నైపుణ్య నేరస్తుడు శ్రీ చంద్రబాబు అరెస్టుకు బెంగళూరులో ఐటీ ఉద్యోగుల నిరసనంటూ పచ్చకుల మీడియా హోరెత్తిస్తోంది...వీరు నిజంగా ఐటీ ఉద్యోగుల్లా ఉన్నారా? టీడీపీ కిరాయి పెయిడ్ ఆర్టిస్టుల్లా కనిపిస్తున్నారే! " అంటూ ట్వీట్ చేశారు.


Next Story