27 ఏళ్ల నాటి కేసు.. వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష విధించిన కోర్టు

వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు 27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది

By Medi Samrat  Published on  16 April 2024 3:08 PM IST
27 ఏళ్ల నాటి కేసు.. వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష విధించిన కోర్టు

వైసీపీ ఎమ్మెల్సీ, మండపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులకు 27 ఏళ్ల నాటి శిరోముండనం కేసులో విశాఖ ఎస్సీ, ఎస్టీ కోర్టు షాక్ ఇచ్చింది. శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులకు జైలు శిక్ష విధించింది. 18 నెలల జైలు శిక్ష, రూ.1.50 లక్షల జరిమానా విధిస్తున్నట్టు కోర్టు తీర్పు ఇచ్చింది. 1996 డిసెంబర్ 26న వెంకటాయపాలెంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

అప్పట్లో ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో తనకు వ్యతిరేకంగా వ్యవహరించారనే కారణంతో ఐదుగురు దళితుల్ని హింసించి, వీరిలో ఇద్దరికి శిరోముండనం చేయించారనే ఆరోపణలు తోట త్రిమూర్తులుపై ఉన్నాయి. 1996 నుంచి సుదీర్ఘంగా విచారణ సాగింది. ఈ కేసులో తోట త్రిమూర్తులుతో పాటు మరో 9 మంది నిందితులుగా ఉన్నారు. విశాఖలోని ఎస్సీ, ఎస్టీ అత్యాచారాల కేసుల ప్రత్యేక కోర్టు శిక్ష ఖరారు చేసింది. తోట త్రిమూర్తులుకు 18 నెలల జైలు శిక్షను విధించింది. రూ. 2.50 లక్షల జరిమానా విధించింది. 28 ఏళ్ల తర్వాత ఈ కేసులో తీర్పు వచ్చింది. ఈ తీర్పును త్రిమూర్తులు కోర్టులో సవాల్ చేసే అవకాశం ఉంది.

Next Story