వైసీపీలో తీవ్ర విషాదం.. చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత‌

YSRCP MLC Challa Bhageerath Reddy Passed Away. వైసీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆ పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూశారు.

By Medi Samrat
Published on : 2 Nov 2022 6:28 PM IST

వైసీపీలో తీవ్ర విషాదం.. చల్లా భగీరథ రెడ్డి కన్నుమూత‌

వైసీపీ శ్రేణుల్లో తీవ్ర విషాదం నెల‌కొంది. ఆ పార్టీ నాయ‌కుడు, ఎమ్మెల్సీ చల్లా భగీరథ రెడ్డి కన్నుమూశారు. 46 ఏళ్ళ భగీరథ రెడ్డి కొంత కాలంగా న్యుమోనియాతో పోరాడుతూ హైదరాబాద్ లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో వెంటిలేటర్ పై ఉన్నారు. పరిస్థితి విషమించి కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు. రేపు ఆయన స్వస్థలమైన అవుకులో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. భగీరథ‌ రెడ్డి మాజీ ఎమ్మెల్యే చల్లా రామకృష్ణారెడ్డి కుమారుడు. భగీరథ రెడ్డి తన తండ్రితో కలిసి 2019 లో వైసీపీలో చేరారు. అంతకు ముందు ఆయన యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులుగా పని చేశారు. రామకృష్ణా రెడ్డి మృతి చెందిన తర్వాత భగీరథ రెడ్డికి వైసీపీ ఎమ్మెల్సి టిక్కట్ ఇచ్చింది. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ పొలిటికల్ సైన్స్ చేశారు. చల్లా భగీరథ రెడ్డికి భార్య‌, ఇద్ద‌రు కుమారులు.


Next Story